సమ సమాజ స్థాపన కోసం, జనహితం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. శనివారం భారతదేశ తొలి ఉప ప్రధాని, అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా హిందూ కాలేజీ కూడలిలోని అయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులార్పించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తితో స్వతంత్ర సంగ్రామంలోనూ, కుల రహిత సమాజ స్థాపనలోనూ జగ్జీవన్ రామ్ అలుపెరుగనిపోరాటం చేశారంటూ కొనియాడారు. తన యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో ముప్పై ఏళ్ళు వివిధ కీలక పదవులు అధిరోహించినా ఎక్కడా కూడా మచ్చ లేని నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగిస్తూ, అయన కన్న కలల్ని సాకారం చేసే దిశగా ప్రతీ ఒక్కరం కృషి చేయాలని ఆళ్ళ హరి అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర ఉపాధక్ష్యులు కొండూరి కిషోర్ కుమార్, కార్యదర్శి మెహబూబ్ బాషా, బందెల నవీన్, కొణిదెటి కిషోర్, పులిగడ్డ కిషోర్, నండూరి స్వామి, మంత్రి లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment