ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండించిన ఉత్తరాంధ్ర వీరమహిళలు

విజయనగరం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పైన మరియు ఆయన వ్యక్తి గత జీవితంపై ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఉత్తరాంధ్ర వీర మహిళలు శుక్రవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని పాల్ నగర్ జనసేన పార్టీ ఆఫీసులో సమావేశమై ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ ను తీవ్రంగా ఖండించారు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు విజయనగరం నియోజకవర్గం ఇంచార్జి శ్రీమతి పాలవలస యశస్వి మాట్లాడుతూ వై.ఎస్ జగన్ కు సభ్య సమాజంలో నివసించే అర్హత ఏమాత్రం లేదనీ, తక్షణమే ఇలాంటి వ్యక్తులను గద్దె దింపి జైల్లో పెట్టాలని, తక్షణమే ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వీర మహిళలు ఆందోళన చేసి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ మహిళా రీజినల్ కోఆర్డినేటర్స్, ఉత్తరాంద్ర మహిళా లీగల్ సెల్ సభ్యులు, వీరమహిళలు, నాయకులు పాల్గొన్నారు.