వంగవీటి రంగా చరిత్ర సజీవమే

*తాడేపల్లిగూడెంలో ఘనంగా రంగా 78వ జయంతి ఉత్సవాలు

తాడేపల్లిగూడెం, వంగవీటి మోహన రంగా 78వ జయంతి వేడుకలు తాడేపల్లిగూడెంలో ఘనంగా నిర్వహించారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు జనసేన యువ నాయకుడు బొలిశెట్టి రాజేష్, భవన నిర్మాణ కార్మికుల కార్పొరేషన్ చైర్మన్ వలవల బాబ్జిలు పాల్గొని పోలీస్ ఐలాండ్, గొల్లగూడెం సెంటర్లలోని విగ్రహాలకు పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ, “రంగా ఒక వ్యక్తి కాదు – ఒక శక్తి. ఆయన బడుగు బలహీన వర్గాలకే కాకుండా సమాజానికే ఆదర్శం,” అని తెలిపారు. ఆయన పేరును జిల్లా స్థాయిలో ప్రతిష్టించేందుకు తండ్రి బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. రంగా అభిమానులు అన్నీ పార్టీల్లో ఉన్నారని, ఆయన చరిత్ర తరతరాలకూ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు, కూటమి నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు.

Share this content:

Post Comment