*జనసేన నేత గురాన అయ్యలు
విజయనగరం, అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామి నాయుడు పిలుపు మేరకు పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక జీఎస్ఆర్ హోటల్లో జనసేన నేత గురాన అయ్యలు చేతులు మీదుగా మెగాస్టార్ పుట్టినరోజు వారోత్సవాల పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అయ్యలు మాట్లాడుతూ తెలుగు సినిమాకు చిరంజీవి గొప్ప స్ఫూర్తి అని, దూరదృష్టి కలిగిన వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు. వెండితెరపై ఎన్నో మరపురాని పాత్రల్లో నటించి మెప్పించారని గుర్తు చేశారు. సేవా రంగంలో మెగాస్టార్ చిరంజీవి ఎవరెస్టు శిఖరమన్నారు. సినీ, రాజకీయ, సేవా రంగాల్లో చిరంజీవి సేవలు మరువలేనివని పేర్కొన్నారు. మానవ సేవ మాధవ సేవని నమ్మిన మెగాస్టార్ చిరంజీవి బ్లడ్, ఐ బ్యాంక్‌లను స్థాపించి ఎంతో మందికి రక్తదానం, నేత్రదానం చేస్తున్నారన్నారు. సేవా కార్యక్రమాలకు మారుపేరుగా మెగా ఫ్యామిలీ నిలిచిందని కొనియాడారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15 నుంచి 22 వరకు వారం రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలను అభిమానులు నిర్వహించడం అభినందనీయమన్నారు. జిల్లాలో మెగా అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. జిల్లా అధ్యక్షులు రాంకీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు రంగనాయకులు. చక్రవర్తి. హుస్సేన్ ఖాన్. ఏంటి రాజేష్. బొబ్బది చంద్రనాయుడు, లక్ష్మణ్, కుమార్, బొబ్బది అప్పలనాయుడు, మిమ్స్ శ్రీను, సతీష్, సురేష్ పాల్గొన్నారు.
Share this content:
Post Comment