- ఛలో పిఠాపురం పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి
గుంటూరు, మార్చి 14 న పిఠాపురం చిత్రాడలో జరగనున్న జనసేన 12 వ ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోతుందని గుంటూరు జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న జనసేన సానుభూతిపరులు ఈ సభకు రికార్డ్ స్థాయిలో తరలిరానున్నరన్నారు. శనివారం శ్రీనివాసరావుతోటలో ఛలో పిఠాపురం పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ కొనియాడారు. అవినీతి, ఆరాచకం, దాష్టికం, కులమతాలతో కునారిల్లుతున్న రాజకీయ వ్యవస్థలో పవన్ కళ్యాణ్ విలువలతో కూడిన రాజకీయాలతో ముందుకు సాగుతూ వ్యవస్థలో గొప్ప మార్పును తీసుకురావటం ముదావహమన్నారు. నిజాయితీ, నిబద్దత, నిస్వార్థ సేవ అనే పునాదులపై జనసేన నిర్మాణం జరిగిందన్నారు. ప్రజల పక్షాన పోరాటాలు, ఉద్యమాలు చేసి వారికి కొండంత అండగా జనసేన శ్రేణులు నిలిచాయన్నారు. జనసేన ప్రస్థానం రాజకీయ లబ్ది కోసం కాదన్నారు. జనసేన చేసే ప్రతీ ఆలోచన, వేసే ప్రతీ అడుగు ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసమేనన్నారు. జగన్ మూర్ఖ పరిపాలన నుంచి ప్రజల్ని జనసేన విముక్తి చేసిందన్నారు. పోటీ చేసిన ప్రతీ చోట గెలిపించి రాజకీయ రంగ చరిత్రలో ఏ పార్టీకి ఇవ్వనంత గొప్ప మెజారిటీని ప్రజలు జనసేనకు ఇచ్చారన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరింత బాధ్యతతో పార్టీ శ్రేణులు ముందుకు సాగుతామని ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో రెల్లి నేత సోమి ఉదయ్ కుమార్, మెహబూబ్ బాషా, మిద్దె నాగరాజు, కోలా అంజి, స్టూడియో బాలాజీ, వడ్డె సుబ్బారావు, నండూరి స్వామి, తాడికొండ శ్రీను, ఇల్లా చిరంజీవి, ఆలా గోవింద్, మాడుగుల నరసింహ రెల్లి, గోపిశెట్టి రాజశేఖర్, మహేష్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment