కుంబిడి పంచాయతీ పరిధిలో జనసేన పార్టీ విస్తృత ప్రచారం

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ కర్త, గిరిజన నేత ఎక్స్ జడ్పిటిసి నిమ్మల నిబ్రమ్ ఆదేశాలు మేరకు కుమ్మిడి పంచాయతీ గ్రామంలో జనసేన గిరిసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముందుగా గ్రామంలో వెలిసిననటువంటి శివాలయంని దర్శించుకుని గ్రామ పర్యటన చేస్తూ స్థానిక ప్రజలుకి జనసేన పార్టీ పైన అవగహన కలిపించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జనసేన పార్టీ నాయకుడు బి.పి.నాయుడు మాట్లాడుతూ మన నియోజకవర్గంకి ఒక బలమైన గిరిజన నేత ఎక్స్ జడ్పిటిసి నిమ్మల నిబ్రమ్ ని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు కనుక ప్రతి ఒక్కరు జనసేన పార్టీ బలోపేతం కోసం కష్టపడి పని చేయ్యాలి అని కోరుకుంటున్నాను అని అన్నారు. వీరఘట్టం మండలం క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ మత్స పుండరికం మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ క్రియాశీలక సభ్యత్వం పెట్టి ప్రతి ఒక్కరికి అండగా ఉంటున్న విషయం ప్రజలకి తెలియజేయాలని అన్నారు. జనసేన జానీ మాట్లాడుతూ వైస్సార్సీపీ ప్రభుత్వం అడ్డా దారులు తొక్కుతూ ఎక్కడ ప్రజలు కి రక్షణ లేకుండా చేస్తూ బిసి, ఎస్సి, ఎస్టి కార్పొరేషన్ నిధులు లేకుండా సామాన్య జీవితాలుతో చెలగాటం ఆడుతున్నా ఈ వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని పొత్తు ధర్మంలో భాగంగా ఉమ్మడి అభ్యర్థి (జనసేన-తెలుగుదేశం) లను గెలిపించాలని కోరారు. నందివాడ. పండు మాట్లాడుతూ ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని చూసి విద్యార్థుల జీవితం నాశనం అయిపోయింది అని, ఎక్కడా ఎలాంటి జాబ్ కేలండర్ లేక విద్యార్థులు నిరుద్యోగులు అయిపోయారని తన ఆవేదన వ్య్క్తం చేసారు. కుమ్మిడి జనసేన నాయుకులు ప్రజలు యువత స్థానిక టీడీపీ ప్రెసిడెంట్ బిడ్డీక గౌరునాయుడు మాట్లాడుతూ జగన్ పధకాలు పేరు పెట్టి ప్రజలు సొమ్మును తినే తిమింగళం లాంటివాడు అని కచ్చితంగా ఈ సారి మేము జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థికే ఓటు వేస్తాం మహిళలు చెప్పడం ప్రజల్లులో జగన్ రెడ్డి పైన వ్యతిరేకత పవన్ కళ్యాణ్, చంద్రబాబు పైన నమ్మకం ఏ స్థాయికి వెళ్ళింది అర్ధం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరఘట్టం మండలం జనసేన టీమ్ టౌన్ సిర్లపు అచ్యుత్ టీమ్ స్థానిక ప్రజలు మహిళలు యువత పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.