సమస్యకు పరిష్కారం తీసుకురావటం జనసేన పార్టీ వలనే సాధ్యమవుతుంది

రాజాం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో, వంగర మండలం జనసైనికుల ఆహ్వానం మేరకు జనసేన రాజాం నియోజకవర్గం నాయకులు ఎన్ని రాజు వంగర మండలంలో పలు ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపించడానికి సుడిగాలి పర్యటన చేయడం జరిగింది. ఆ పర్యటనలో భాగంగా రుషింగి – కిమ్మి వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్న సమయంలో ఎన్ని రాజు జనసైనికులతో చేసిన పోరాట ఫలితంగా రుషింగి గ్రామంలో వంతెన నిర్మాణ పనులు త్వరితగతిన తేది 2-4-2022 శుక్రవారం నాడు ప్రారంభించటం జరిగింది. ఇలాంటి సమస్యకు పరిష్కారం తీసుకురావటం జనసేన పార్టీ వల్ల సాధ్యమవుతుంది అని రాజాం నియోజకవర్గం నాయకులు ఎన్ని రాజు ఆధ్వర్యంలో జనసైనికుల సహకారంతో నిరూపించటం జరిగింది. ఈ సందర్భంగా రుషింగి – కిమ్మి గ్రామస్తులు భవిష్యత్తులో రాజాం నియోజకవర్గంలో ఎన్ని రాజు నాయకత్వంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జెండా ఎగరడం ఖాయమని తమ సంతోషాన్ని వ్యక్త పరచటం జరిగింది. ఇదే స్ఫూర్తితో రాజాం నియోజకవర్గంలో జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు మరియు స్థానిక నియోజకవర్గ ప్రజలు జనసేన పార్టీ ప్రభుత్వ స్థాపన లక్ష్యంగా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేసారు.