జ‌న‌సేన పార్టీకి అన్న‌దాసు లాంటి నాయ‌కులు అవ‌స‌రం

  • తెలుగు రాష్ట్రాలలో 1002 సభ్యత్వాలు చేసి రెండవ స్థానం
  • పార్టీ ఆవిర్భావం నుంచి నిరంత‌ర కృషి
  • 49 నెల‌ల నుంచి పార్టీకి నిర్విరామంగా ఫండ్ అంద‌చేత‌
  • 2024 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ను సీఎంగా చేసేందుకు అడుగులు
  • జనసేన పార్టీ జిల్లా అధికార ప్ర‌తినిధి ఆళ్ళ హ‌రి

గుంటూరు, జ‌న‌సేన పార్టీ అభివృద్ధికి, పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళ‌డంలో ఆ పార్టీ నాయ‌కుడు అన్న‌దాసు వెంక‌ట సుబ్బారావు చేసిన కృషి వెల‌క‌ట్టలేనిద‌ని, ఆయ‌న లాంటి నాయ‌కులు పార్టీకి చాలా అవ‌స‌రం ఉంద‌ని ఆ పార్టీ జిల్లా అధికార ప్ర‌తినిధి ఆళ్ళ హ‌రి అన్నారు. స్థానిక పండ‌రీపురం 5వ లైనులో గ‌ల జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్తల కార్యాల‌యంలో తెలుగు రాష్ట్రాలలో 1002 సభ్యత్వాలు చేసి రెండవ స్థానంలో నిలిచిన అన్న‌దాసును జ‌న‌సేన పార్టీ శ్రేణులు ఘ‌నంగా స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా హ‌రి మాట్లాడుతూ పార్టీకి సభత్వం ఎంత ఉపయోగమో అందరికి తెలిసిందేన‌ని, తెలుగు రాష్ట్రాలలో 1002 సభ్యత్వాలు చేసి రెండవ స్థానంలో నిల‌వ‌డ‌మంటే సాధార‌ణ విష‌యం కాద‌ని అన్నారు. పార్టీకి మొదట నుండి తనవంతు సహకారం అందిస్తూ, ప్రతి కార్యక్రమం విజ‌య‌వంతం అయ్యేలా కృషి చేస్తూ పార్టీ ఎదుగుదలకు నిరంత‌రం అడుగులు వేస్తున్న సుబ్బారావుని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియ‌జేస్తున్నామ‌ని తెలిపారు. పార్టీలో ప‌ద‌వులు ఆశించ‌కుండా ఎల్ల‌ప్పుడు పార్టీ అభివృద్ధికై ఆలోచిస్తూ వ‌రుస‌గా 49 నెలల నుండి పార్టీకి ప్రతి నెల ఫండ్ అందిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచార‌ని కొనియాడారు. ఆయ‌న సేవ‌లు భ‌విష్య‌త్ లో విజ‌య‌వంతంగా కొన‌సాగాల‌ని, ప్ర‌తి ఒక్క జ‌న‌సైనికుడు, నాయ‌కులు 2024 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ విజ‌యానికై, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను సీఎంగా చేసేందుకు మ‌రింత కృషిచేయాలని హ‌రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు యర్రంశెట్టి పద్మావతి, దాసరి లక్ష్మిదుర్గ, ఆ పార్టీ వీర‌మ‌హిళ‌లు బిట్రగుంట మల్లిక, పాక‌నాటి ర‌మాదేవి, కొల్ల పద్మావతి, జ‌న‌సైనికులు గంధం సురేష్, చింత రేణుక రాజు, దాసరి వాసు, కొండూరు కిశోర్, సూదా నాగరాజు, తోట కార్తిక్, సోమి ఉదయ్, బండారు రవీంద్ర, పాములూరి కోటేశ్వరరావు, జనసైనికులు, క్రియాశీల కార్యకర్తలు పాల్గొన్నారు.