జనసేన పార్టీపై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదు

  • ఎమ్మెల్యే మీ అనుచరుల నోరు అదుపులో పెట్టండి…!
  • మీ కుర్చీ కదిలే సమయం ఆసన్నమైంది….!
  • జనసేన పార్టీపై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదు!
  • మీ కోట రాజకీయలకు భయపడే రోజులు పోయాయి…!
  • జనసేన గిరిజన నాయకులు ఎంపీటీసీ మల్లేష్

కురుపాం, ఇటీవల వైస్సార్ పార్టీ ప్లీనరీ సమావేశంలో మాజీ మంత్రి పుష్పాశ్రీవాణి బంధువు బాచీ జనసేన పార్టీ గుర్తు కోసం వ్యంగ్యంగా మాట్లాడిన మాటలను ఖండిస్తూన్నామంటూ కురుపాం నియోజకవర్గ జనసేన నాయకులు కార్యకర్తలు నియోజకవర్గ కేంద్రమైన కురుపాం రావాడ కూడలిలో బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కురుపాం నియోజకవర్గ జనసేన గిరిజన నాయకులు ఎంపీటీసీ కడ్రక మల్లేశ్వరావు, చినఖేర్జల సర్పంచ్ గంగాధర్ మాట్లాడుతూ మొన్న వైసీపీ పార్టీ ప్లీనరీ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పుష్పాశ్రీవాణి తన బంధువు బాచీతో జనసేన పార్టీ గురుంచి అవాకులు చవాకులు మాట్లాడించి పైశాచిక ఆనందం పొందినట్లు మేము భావిస్తున్నామని కురుపాం నియోజకవర్గంలో జనసేన పార్టీ అంటే పుష్పాశ్రీవాణికి వణుకు పుడుతున్నట్లుందని రోజు రోజుకి జనసేన పార్టీ క్షేత్ర స్థాయిలో బలపడుతున్న తీరుని చూసి ఓటమి భయం పట్టుకున్నట్లుందని అందుకే ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని 2014, 2019లో లాగా మీ కోట రాజకీయాలని సహించే ఓపిక గిరిజన యువతకు, కురుపాం నియోజకవర్గ జనసైనికులకు లేదని మీరు 3 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కురుపాం నియోజకవర్గానికి ఏ ఒక్క లబ్ది చెయ్యలేని అసమర్థురాలువని కాబట్టే ఈరోజు మీరు గడప గడపకు వైసీపీ అంటూ వెళ్తుంటే జనం ఛీ కొడుతున్నారని జనసేన పార్టీ వెళుతుంటే ఊరు ఊరంతా కదిలొచ్చి గిరిజన బహుజనులందరూ కలిసొచ్చి బ్రహ్మరథం పడుతున్నారని జనసేన ఎదుగుదల చూసి ఓర్వలేక జనసేన పార్టీ మీద అవాకులు చవాకులు పేలడం కాదని మీరు గత రెండు దఫాలుగా గెలిచి ఈ నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్దేంటో బహిరంగ చర్చకు రండి…జనసేన పార్టీ తరపున మీకు మేం సవాల్ విసురుతున్నామని మీరు నియోజకవర్గంలో ఏం అభివ్రృద్ది చేసారో చూపించండని మేం మీ కోట అభివ్రృద్ది మీ బంధువుల అభివృద్ది మీ నాయకుల అభివృద్ధి మీ ఆస్తుల అభివృద్ది ఎలా అయిందో చూపిస్తామని మీ హయాంలో ఎన్ని అవకతవకలు, అక్రమాలు, ఐటీడీఏ నిధుల దారి మల్లింపు ఎలా జరిగాయో బహిరంగంగానే చర్చించుకుందమని అప్పుడెప్పుడో మా వాళ్లను ఒక్కొక్కరిని కోటకి పిలిచి బెదిరించడం కాదని మీకు దమ్ముంటే ఇప్పుడు పిలవండని నియోజకవర్గం మొత్తం కదలి వస్తామని మీ అసమర్థతని మీ వ్యక్తిగత అభివృద్దిని ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపిస్తామని ఖబడ్దార్, ఇంకోసారి మా జనసేన గురుంచి చమత్కారాలు చేస్తే సహించేది లేదని 2024 లో తట్టా బుట్టా సర్దుకొని సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టబోతున్నామని మీ కోట రాజకీయాలకి భయపడే రోజులు పోయాయని ఈరోజు జనసేన రూపంలో జనంలో చైతన్యం రగిలిందని మమ్మల్ని మా ప్రజల్ని భయపెట్టి, మభ్యపెట్టి రాజకీయాలు చేస్తామంటే, చూస్తూ ఊరుకోం..ఎదురు తిరుగుతాం, తరిమి కొడతాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు నెరుడబెల్లి వంశీ, గార గౌరి శంకర్, ఉపేంద్ర, రంజిత్, రాజేష్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.