ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జనసేన పోరాటం: గంధం ఆనంద్

ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ ముందుండి పోరాటాలు నిర్వహిస్తుందని మధిర నియోజక వర్గం జనసేన పార్టీ విద్యార్థి విభాగం నాయకులు గంధం ఆనంద్ అన్నారు. శనివారం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధానంగా యవతకు ఇచ్చిన వాగ్దానాలలో ఏ ఒక్కటి అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కారం చేయడమే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయమని ఈ సందర్భంగా అన్నారు. అనేక సంవత్సరాలు తెలంగాణ కోసం బలిదానాలు చేసి సాధించుకున్న రాష్ట్రంలో యువతకు మిగిలింది ఏమీ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయి అనుకున్న వారి ఆశలు నిరాశలుగానే మిగిలాయి అని అన్నారు. రెండో సారి జరిగిన ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నీటి మూటలుగా ఉన్నాయన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి సమస్యలు రాష్ట్రం పరిష్కారం చేయలేదని దుయ్యబట్టారు. తెలంగాణలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ ముందు అడుగు వేస్తుంది అని అన్నారు.