పొన్నవోలు పంచాయతీ వీది లైట్ల సమస్యపై జడ్జి తీవ్ర ఆగ్రహం

పొన్నవోలు: అక్టోబర్ లో పొన్నవోలు పంచాయతీలోని చలమరెడ్డి కొట్టాలు గ్రామం లోని వీది లైట్ల సమస్యపై గ్రామ జనసేన నాయకుడు ఎస్.ఎన్ రమేష్ రెడ్డి కోర్టుకు వెళ్లగా.. కోర్టు వారు సర్పంచ్ మరియు అధికారులకి నెల రోజులలో వీది లైట్లు వేయాలని ఆర్డర్ వేశారు. నెల రోజులు గడిచిన 13 లైట్లు గాను కేవలం 5 లైట్లు మాత్రమే వేసి మిగతావి వేయనందున కోర్టు జడ్జి తీవ్రంగా ఆగ్రహించి వచ్చే నెల 9వ తేదీలోపు మొత్తం లైట్లు వేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కోర్టు వారు హెచ్చరించారు. జడ్జి సానుకూలంగా తీర్పు ఇవ్వడం పట్ల జనసేన నాయకులు హర్షం వ్యక్తం చేశారు.