ప్రమాదకరంగా భూ హక్కు చట్టం

  • ఈ చట్టంతో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది
  • న్యాయవాదులకు జనసేన పూర్తి మద్దతు
  • నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం ప్రజల ఆస్తులకు ప్రమాదకరంగా మారుతుందని నగర జనసేన అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ ఆందోళన వ్యక్తం చేశారు. భూ హక్కు చట్టం రద్దు చేయాలంటూ జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు చేపట్టిన నిరాహారదీక్షకు ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ ఈ చట్టంతో ప్రజల ఆస్తులకు ఏ విధంగానూ భద్రత ఉండదన్నారు. వైసీపీ నేతలు ఈ ఐదేళ్లలో దోచుకున్న, కబ్జా చేసిన భూములను చట్టబద్ధం చేసుకునేందుకే ఈ చట్టం తెచ్చారని విమర్శించారు. ప్రజలు కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తులపై ప్రభుత్వ పెత్తనం ఏమిటంటూ ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో పాలన అంభేడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నడవటం లేదని, జగన్ రాజ్యాంగం ప్రకారం నడుస్తుందని దుయ్యబట్టారు. భూ హక్కు చట్టం రద్దు అయ్యేవరకు న్యాయవాదులు చేపట్టే ఎలాంటి పోరాటాలకైనా జనసేన పూర్తి స్థాయిలో మద్దతు నిస్తుందని నేరేళ్ళ సురేష్ అన్నారు. ఈ రోజు దీక్షలో పాల్గొన్న న్యాయవాదులు: శ్రీకృష్ణయ్య, హనుమంతరావు, కోటేశ్వరరావు, బండ్ల గోపి, అశోక్ కుమార్, సురేష్, శ్రీనివాస్, సాయి చందు, సాయి శ్రుతి, జ్ఞానేశ్వరి, నిర్మల, అడపా.శిరీష్, శ్రీనివాస రావు, శ్రీరాములు, విజయ్ ప్రతాప్. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా.మాణిక్యాలరావు, శిఖా బాలు, మధు లాల్, నరసింహారావు, యడ్ల వెంకటేశ్వరరావు, కదిరి సంజయ్, చింతా శివ, హుస్సేన్, పతెళ్ళ మల్లి, తిరుమలశెట్టి నరసింహారావు. ఈ కార్యక్రమంలో నగర్ కమిటీ సభ్యులు, పలు డివిజన్ అధ్యక్షులు, జన సైనికులు, వీరమహిళలు, తదితరులు పాల్గొన్నారు.