స్థలదాత ఆత్మ శాంతించాలంటే స్థలం వారసులకే చెందాలి: డా.యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండల కేంద్రం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధి పేరిట నిరుపేదలు కలిగి ఉన్న స్థలాన్ని ఆక్రమించడం అక్రమమని, దానిని ఆపాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజిల్ రెడ్డి ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా కొంత వ్యవసాయ భూమిని ఏలుబడి చేస్తూ చివరికి ప్రభుత్వ కళాశాలకు అప్పనంగా అప్పగిస్తే చివరికి ఆ కుటుంబానికి జరిగింది అన్యాయమేనని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు ఎకరాలు స్థలం ఇచ్చినవారికి ఏమి వెలగపెట్టారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు చెంగారెడ్డి మొండి చెయ్యి చూపిస్తే, నేడు నారాయణ స్వామి మొండి మాట తప్ప గోవిందయ్య వారసులకు న్యాయం జరగలేదని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత స్థానిక రెవిన్యూ అధికారులు, జిల్లా సంయుక్త కలెక్టర్ మరియు జిల్లా కలెక్టర్ గోవిందయ్య వారసులకు ప్రస్తుతం వారి adhInamlO ఉన్న భూమిని వారికి కేటాయించి, ప్రభుత్వ కళాశాల చుట్టూ, కళాశాల వెనుక వైపు భాగంలో కావలసినంత ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నందున, వాటికి బదులుగా స్థల సమీకరణ చేసి, ఇటు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి, అటు నిరుపేదల క్షేమాభివృద్ధికి ఆటంకం కలుగకుండా సమన్యాయం చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నానన్నారు. ఈ సమన్యాయం జరగకపోతే నిరుపేదల పక్షాన ఆమరణ నిరాహార దీక్షకు సతి వెనుకాడబోమని హెచ్చరించారు. స్థానిక కాంట్రాక్టర్ కు ఏదైనా వ్యక్తిగత బేధాభిప్రాయాలు ఉంటే దానిని నిరుపేదల మీద చూపించకుండా, ప్రతిదీ మానవతా కోణంలో ఆలోచించి, పేదలకు అన్యాయం జరగకుండా, ప్రభుత్వ కళాశాల అభివృద్ధికి పాటుపడాలని హితవు పలికారు. స్థలదాత ఆత్మ శాంతించాలంటే వారసుల స్థలం వారికే చెందాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్వేటినగరం టౌన్ ప్రెసిడెంట్ రాజేష్, జిల్లా సంయుక్త కార్యదర్సులు రాఘవ, నరేష్, టౌన్ కమిటీ ఉపాధ్యక్షులు సూర్య నరసింహులు, కార్యదర్శి మనీ, కార్వేటినగరం మండల బూత్ కన్వీనర్ సురేష్ రెడ్డి, కార్వేటినగర్ మండల ప్రధాన కార్యదర్శి రుద్ర, జిల్లా కార్యక్రమ కమిటీ సభ్యులు భాను చంద్రారెడ్డి, కార్వేటి నగరం టౌన్ కమిటీ ప్రధాన కార్యదర్శి మహేందర్, గ్రామస్తులు ఉన్నారు.