పిఠాపురం నియోజకవర్గంలో ఆవిర్భావ సభ సన్నాహక సమావేశాల నాలుగో రోజు గొల్లప్రోలు మండలంలో పర్యటన జరిపారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్త మరియు చోడవరం నియోజకవర్గ ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు, ఇచ్చాపురం నాయకులు మరియు సమన్వయకర్త దాసరి రాజుతో కలిసి మండలంలోని పది గ్రామాలను సందర్శించారు. తాటిపూడి, చిన జగ్గంపేట, వన్నెపూడి, కొడవలి, చెందుర్తి, చేబ్రోలు, ఎ.కె మల్లవరం, ఎ.పి మల్లవరం, దుర్గాడ, ఎ విజయనగరం గ్రామాల్లో జనసేన కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల ప్రజలు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వల్ల తమ గ్రామాలలో అభివృద్ధి నిరంతరంగా కొనసాగుతోందని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి పట్ల గొల్లప్రోలు మండల ప్రజల అభిమానం వెలకట్టలేనిదని పివిఎస్ఎన్ రాజు అన్నారు. పివిఎస్ఎన్ రాజు మాట్లాడుతూ ఈనెల 14న జరగబోయే జనసేన ఆవిర్భావ సభ పండగలా జరగనుందని, రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిమంది జనసేన కార్యకర్తలు తరలి వస్తున్నారని, వారందరికీ గౌరవం చూపిస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తాటిపర్తి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో ఉన్న మహిళలు, పురుషులతో సమావేశమైన పివిఎస్ఎన్ రాజు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం పిఠాపురం నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే అని, ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించితే ఆ ప్రేమకు ప్రతిఫలంగా అభివృద్ధిని అందజేస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెన్న చక్రధరరావు, తుమ్మలపల్లి చందు, బవిరిశెట్టి రాంబాబు, ఓదూరు నాగేశ్వరరావు, కిషోర్, జయకృష్ణ, హబీబ్ బాషా, రామిరెడ్డి, మురాలశెట్టి ప్రదీప్, నాగ గౌరీ లక్ష్మి, వినుగొండ వరలక్ష్మి, పద్మరాజు తదితరులు పాల్గొన్నారు.

Share this content:
Post Comment