మజ్జివలస నుంచి బూర్జ ప్రధాన రహదారికి మరమ్మత్తులు చేపట్టాలి

హుకుంపేట మండలం, మజ్జివలస గ్రామం నుంచి బూర్జ వెళ్ళే రహదారిలో రోడ్డు నిర్మాణపు పనుల నాణ్యత లోపం కారణంగా వేసిన తారురోడ్డు ఇటీవలే కురిసిన వర్షాలకు ద్వంసమయ్యింది. రానున్న వర్షాకాలంలో ఇలాంటి నాణ్యత లోపమైన పనులతో నిర్మించిన రహదారి పరిస్థితి ఎలా వుంటుందో ఏజెన్సీ గిరిజన ప్రజలకు తెలిసిందే!. ప్రభుత్వ అధికారులు ఎంత నీతి నిజాయితీతో విధులు నిర్వహిస్తారో ఈ రోడ్డు నిర్మాణం పనులు నాణ్యత పరిశీలిస్తే అర్థమవుతుంది. గిరిజన ప్రాంత ప్రజా సమస్యలపై ప్రభుత్వ అధికారులకు శిత్తశుద్ధి లేదు కాగా పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని అవలంబించడం బాధాకరమని గ్రామ వైస్ సర్పంచ్ పరశురాం అన్నారు. ఈ విషయమై హుకుంపేట మండల జనసేన పార్టీ నాయకులు బలిజ కోటేశ్వరరావు పడాల్ స్పందిస్తూ గిరిజన ప్రాంతంలో ఎటువంటి నిర్మాణమైన, రోడ్డు సౌకర్యమైన చిత్తశుద్ధి లేనటువంటి నిర్వహణ వల్ల అనేక సమస్యలతో గిరిజన ప్రజానికం ఇబ్బందులు పడుతుందని, సంబంధిత అధికారులు ఈ రోడ్డు యొక్క నాణ్యత విషయం సత్వరమే స్పందించి మరమ్మత్తులు చేయగలరని ఆశిస్తున్నామన్నారు. ఇటువంటి ప్రధాన గ్రామాలకు ప్రజా రవాణాకు ఉపయోగపడే రహదారులు ఎంతో ఎంతో పటిష్టంగా ఉండాలని వాటిని మూడునాళ్ల ముచ్చటగా మొక్కుబడిపనులతో పూర్తి చేసి చేతులు దులుపుకోవడం తగదని ఇటువంటి శిత్తశుద్ది లేని రోడ్డు నిర్మాణాలతో గిరిజన ప్రజలకు ఏమార్చడం తగదని హెచ్చరిస్తున్నామన్నారు. అలాగే బూర్జ గ్రామస్తులు, ప్రజలు ఈ విషయాన్ని పత్రికా సోదరులకు తెలియజేస్తూ మా యొక్క సమస్యల గురించి ప్రభుత్వానికి తెలియజేసే విధంగా తమ ఔదార్యాన్ని చూపాలని, సంబంధించిన రోడ్డు నిర్మాణపు ప్రభుత్వ అధికారులు రోడ్డు యొక్క స్థితిని, నాణ్యతను పునః పరిశీలించి మరమ్మత్తులు చేసే విధంగా ఆలోచన చేయాలని ఆశిస్తున్నామని తెలిపారు.