కులాల మధ్యన చిచ్చు రేపుతున్న తీరు దుర్మార్గం: జయరామిరెడ్డి

అనంతపురం, వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైసిపి ఐ-ప్యాక్ టీం రాష్ట్రంలో కులాల మధ్యన చిచ్చు రేపుతున్న తీరు చాలా దుర్మార్గం. కొంతమంది “కాపు కుల సంఘ నాయకుల్ని” శిఖండిల్లాగా అడ్డం పెట్టుకొని “జనసేన – టిడిపి పొత్తులో భాగంగా 24 సీట్లేనా! సీఎం పదవిలో పవర్ షేరింగ్ లేదా..? అని జనసేన శ్రేణుల్లో అలజడి సృష్టించి వైసిపి పార్టీకి లబ్ధి చేకూర్చాలనే క్రమంలో కుట్రలు, కుతంత్రాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కులాల గురించి మాట్లాడుతున్నందుకు చింతిస్తూ… తమ వ్యక్తిగత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది ఉచిత సలహాలు, ఉత్తరాలు రాసే కాపు కుల నాయకుల్లారా జనసేన పార్టీ ఏ ఒక కులానికో చెందిన రాజకీయ పార్టీ కాదు? కులాలకు, మతాలకు అతీతంగా ఉన్నత ఆశయాలతో ప్రజా ప్రయోజనాల కోసం ఉద్భవించిన రాజకీయ పార్టీ. దేశంలో ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు ఏదో కులానికి చెందిన వాడే? అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కాపు కులానికి చెందినవారు మాత్రమే? జనసేన పార్టీ నిర్మాణ క్రమంలో గత పది సంవత్సరాల నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని కులాలా, మతాలకు చెందిన ఎంతోమంది మహానుభావులు ఉన్నత ఆశయాలతో అహర్నిశలు కృషి చేసి భాగస్వాములైనారు, వీరందరి కృషి ఫలితమే నేడు జనసేన పార్టీ. జనసేన పార్టీ మూల సిద్ధాంతమే “కులాలను కలిపే ఆలోచన విధానం – మతాల ప్రస్తావన లేని రాజకీయం” అని తెలుసుకోండి. ఇతర రాజకీయ పార్టీలకు చెందిన కులాల్లో కూడా మీలాంటి పెద్ద పెద్ద కుల సంఘాల నాయకులు ఉన్నారు? కానీ వారు ఏనాడు ఆ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులకు బహిరంగ లేఖలు, ఉచిత సలహాలు ఇవ్వరు, తమకు చాతనైతే వారి పార్టీ ఎదుగుదలకు తమ వంతు బాధ్యతగా సహాయ సహకారాలు అందిస్తారు? మరి వారు, మేధావులా! మీరు మేధావులా!! ఇప్పటికైనా ఒక మారు ఆలోచించండి, గత 10 సంవత్సరాలుగా జనసేన పార్టీ ఎదుగుదలలో మీరు ఏ మేరకు సహాయ సహకారాలు అందించారు? రాష్ట్ర ప్రజలకు తెలియజేయగలరా? ఇప్పటికైనా బాధ్యత గుర్తిరిగి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం కలిసి పనిచేస్తారని ఆశిస్తున్నాం. సిద్ధం బహిరంగ సభకు ప్రజలు వస్తున్నారు! తాడేపల్లిగూడెం సభకు ప్రజలు రాలేదు అని వైసిపి పార్టీ నాయకులు వైసిపి మీడియా సంస్థలు విషపు రాతలు రాస్తూ ప్రచారం చేస్తున్నారు, సిద్ధం బహిరంగ సభ జరిగిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండవు, విద్యార్థుల పరీక్షలను సైతం పోస్ట్ పోన్ చేసి అధికారుల చేత బెదిరించి స్కూల్ బస్సుల్ని బలవంతంగా తరలించి ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తూ డబ్బులు, మందు బీరు, బిర్యాని ఇచ్చి బలవంతంగా సిద్ధం సభకు తీసుకొస్తున్నది వాస్తవం కాదా? అంగన్వాడి టీచర్లని, ఆశ వర్కర్లని, పొదుపు సంఘాల మహిళలను, వాలంటరీలను చివరకు ఉపాధి హామీ పథకానికి చెందిన వారిని కూడా అధికారుల చేత, పోలీసులు చేత బలవంతంగా పిలుచుకొచ్చి జరుపుకునే సభలు కూడా ఒక సభలేనా? అని రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులైన సొంత చెల్లెలు ఇంకొక మారు మా అన్నకు చెందిన వైసిపి పార్టీకి ఓట్లు వేయొద్దని చెపుతున్నారంటే ఎంత నిస్సహాయ స్థితిలో వైసిపి పార్టీ ఉందో ఒక మారు అర్థం చేసుకోవచ్చు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో జనసేన – టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ స్పష్టమైన తమ తీర్పుని ఇవ్వబోతున్నారని తెలిసి అసహనంతో, దిక్కుతోచని అయోమయ స్థితిలో వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు,కొంతమంది వైసిపి నాయకులు, వైసిపి ఐ ప్యాక్ టీం మరియు వైసిపి మీడియా సంస్థలు కుట్రలు కుతంత్రాలు విషపు రాతలని రాష్ట్ర ప్రజలు నమ్మరని తెలుసుకోండని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి అన్నారు.