- జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య
రాజంపేట, సిద్దవటం, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య అన్నారు. సిద్దవటం మండలంలోని ఉప్పరపల్లి లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం పొట్టి శ్రీరాములు 124వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ బోధించిన సత్యం, అహింస హరిజనోద్దరణ ఆశయాల కోసం పొట్టి శ్రీరాములు జీవితాంతం కృషి చేశారన్నారు. చిన్నతనం నుంచి దేశభక్తిని పుణికి పుచ్చుకున్న పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన జీవితాన్నే త్యాగం చేశారని రామయ్య కొనియాడారు.
Share this content:
Post Comment