ఎస్ఇసి ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించిన మంత్రి…

ఎపి మంత్రి కొడాలి నాని హౌస్‌మోషన్‌ పిటిషన్‌పై ఆదివారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్‌ఇసి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను కొడాలి నాని ఏమనలేదని మంత్రి తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే, కొడాలి నాని వ్యాఖ్యలు వేరేవారు మాట్లాడిన వాటితో పోల్చి చూడలేమని ఎస్‌ఇసి తరఫున న్యాయవాది తెలిపారు. అలాగే వీడియో ఫుటేజ్‌ మొత్తం పరిశీలిస్తే ఆ విషయం తెలుస్తుందని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. కొడాలి నాని వీడియో ఫుటేజ్‌ ఫైల్‌ చేశారా? అని కోర్టు రిజిస్టర్‌ని అడింగింది. రిజిస్టర్‌ లేదని చెప్పగా.. తామే ఆ వీడియో ఫుటేజీ ఇస్తామని, పరిశీలించాలని ఎస్‌ఇసి తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే, ఈ వీడియోను తరువాత పరిశీలిస్తామన్న ధర్మాసనం.. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కాగా, మంత్రి కొడాలి నాని ఈనెల 21 వరకు మీడియాతో మాట్లాడవద్దు అంటూ ఎస్‌ఇసి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ మంత్రి నాని హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.