అట్టహసంగా ప్రారంభమైన జాతీయ స్థాయి ఎడ్ల బళ్ళ ప్రదర్శనలు

దర్శి, జనసేన నాయకులు గరికపాటి వెంకట్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బళ్ళ ప్రదర్శన అట్టహసంగా శనివారం ప్రారంభమయ్యాయి. నాలుగు పళ్ళ విభాగంలో శనివారం పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో 38జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఈ పోటీలను దర్శి జనసేన నాయకులు గరికపాటి వెంకట్, ఇంచార్జ్ బొటుకు రమేష్, జనసేన రాష్ట్ర మహిళ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ దర్శి మాజీ ఎమెల్యే కుమారుడు జనసేన నాయకులు దిరిశాల యేసు రెడ్డి ప్రారంభించారు. ఎడ్ల పోటీలను తిలకించటానికి ప్రజలు విపరీతంగా వచ్చారు. పోటీలు సందర్బంగా దర్శి పట్టణంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అద్దంకి దర్శి రోడ్డులో భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా నియోజకవర్గం పరిధిలోని ప్రతి గ్రామంలో ఎడ్ల బళ్ళ ప్రదర్శనకు సంబదించిన ఫ్లెక్సీ లు ఏర్పాటు చేశారు. ఎడ్ల బళ్ళ ప్రదర్శను తిలకించడానికి వచ్చే ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో భారీ ఎల్.ఈ.డి స్క్రీన్ లును ఏర్పాటు చేశారు. నియోజకవర్గంతో పాటు పలు జిల్లాలు నుండి పోటీలను తిలకించేందుకు రైతన్నలు వచ్చారు. ప్రాంగణం అంత టిడిపి, జనసేన, ఫ్లెక్సీలు, జండాలను ఏర్పాటు చేశారు. పోటీలను తిలకించేందుకు మహిళలు పెద్ద ఎత్తున్న తరలివచ్చారు. పోటీలను తిలకించిటానికి వచ్చిన మహిళలకు ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. దర్శికి వారం రోజులు ముందే సంక్రాంతి పండుగ వచ్చిందని అన్నదాతలు అంటున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.