అన్నమయ్య జిల్లా, టి.సుండుపల్లి మండలంలోని రాయచోటి, రాయవరం, పింఛ, రాజంపేట రోడ్లకు కూడలిలో బైరావగుట్ట సర్కిల్ నందు శ్రీ ఆంజనేయస్వామి గుడి ఎదుట మాజీ సర్పంచ్ రుద్రరాజు రాజమనోహర్ రాజు (డీలర్ రాజు) ఆధ్వర్యంలో శ్రీ వీరంజనేయస్వామి నూతన విగ్రహ ప్రతిష్ఠ ప్రారంభోత్సవం సందర్భంగా వారి ఆహ్వానం మేరకు రాజంపేట అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. తదనంతరం అన్నసంతర్పణలో భక్తాదులకు మరియు ప్రజలకు భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజమ్మ, డాక్టర్ బలరామరాజు, మాజీ సర్పంచ్ పింఛ ప్రాజెక్ట్ చైర్మన్ కె.సుబ్బరామరాజు, మాజీ సర్పంచ్ టి.రాజగోపాల్, తెలుగుదేశం నాయకులు వెంకటేష్ నాయుడు, దామోదర్ నాయుడు, కాంచన రెడ్డయ్య, జనసేన నాయకులు జి.శ్రీనివాసరాజు, నంద్యాల సిద్దయ్య, ప్రతాప్ రెడ్డి, మాధురి విద్యాసంస్థలు అధినేత రెపన సుధాకర్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాము నాయక్, జేసీబీ వెంకటేష్ పలువురు ప్రముఖులు, కూటమి శ్రేణులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, భక్తులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Share this content:
Post Comment