నిహారిక పెళ్లి ముహూర్తం ఖరారు

మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక కొణిదెల పెళ్లి ముహూర్తం తేదీ ఖరారైంది. డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఖరారు చేసినట్లు వరుడి తండ్రి, గుంటూరు ఐజీ జె. ప్రభాకర్‌ రావు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ప్రభాకర రావు దంపతులు స్వామి వారి సేవలో పాల్గొన్నారు. వివాహ పత్రికను స్వామి వారి చెంత ఉంచి, ఆశీర్వచనం తీసుకున్న అనంతరం వివాహ వేదిక, సమయాన్ని ప్రకటించారు. రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఉదయపూర్‌లో ఉన్న ఉదయ్ విలాస్‌ను వివాహ వేదికగా ఖరారు చేసినట్లు చెప్పారు.