ప్రారంభోత్సవం హడావుడి జాస్తి, పనులు ప్రారంభం నాస్తి?

పెడన, గత సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన నడుపూరు-కొత్తపల్లి రహదారిని అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ నాలుగు నెలలు పూర్తయిన, పనులు ప్రారంభం కాలేదు. ఆ రోడ్డుపై ఇప్పటివరకు తట్టెడు మట్టి పడలేదు. పెడన మండలం నడుపూరు, ముదినేపల్లి మండలం కొత్తపల్లి వరకు కోడూరు, నందిగామ, లంకలకలవగుంట, ఉరివి గ్రామాల మీదగా 19.03 కీ.మీ మేర బీటీ రహదారి నిర్మించాలని ఇందుకుగాను మొత్తం రూ.65.68 కోట్ల నిధులు వెచ్చిస్తున్నట్లు గొప్పలు చెప్పారు. అదే రోజు నడుపూరు – ఆర్ వి పల్లి రహదారి పనులు కూడా ప్రారంభోత్సవం చేశారు. దీని నిమిత్తం రూ.1.30 కోట్ల నిధులు ఖర్చు చేస్తారని చెప్పుకొచ్చారు.

పై రెండు రోడ్లలో ఇప్పటివరకు పైసా పని కూడా చేయలేదు.

ఆంధ్రప్రదేశ్ రోడ్ల అధ్వాన పరిస్థితిపై పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించడం తెలిసిన విషయమే. ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రారంభోత్సవ ఆర్భాటాలు తప్ప, క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభాన్ని పట్టించుకోరని నియోజకవర్గం ప్రజలు అనుకుంటున్నారు. పెడన మండలంలో ఈరోజు మరో రెండు శిలాఫలకాలు వెలిశాయి. పెడన నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి నరకానికి నకళ్ళు గా తయారయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు కోరుకునేది శిలాఫలకాలు కాదు. శాశ్విత రోడ్లు. ప్రారంభోత్సవాలు కాదు, ప్రారంభించిన రోడ్లను పూర్తి కావాలని కోరుకుంటున్నారని పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఎస్ వి బాబు సమ్మెట అన్నారు.