మతిభ్రమించిన ప్రసన్న జనసేన పార్టీ గుర్తేదో మర్చిపోయాడంట

మా గాజు గ్లాసు గుర్తు మా దగ్గరే ఉంది కానీ, మా నాయకుడు చెప్పులే మా దగ్గర లేవు ఎవరో ఎత్తేసారు..అంటూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ.. మా పార్టీ గుర్తు గాజు గ్లాసు మాది జనసేన పార్టీ ఇదే విషయాన్ని ఎన్నికల సఘం దృవీకరించింది. గత వారం రోజుల నుంచి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయ యాత్రకి వస్తున్న విశేష జనాదరణ చూసి తట్టుకోలేక వైసీపీ నాయకులకు మతిభ్రమించినట్టుంది. పిల్లగాంగే మీ పెత్తందారుల అవినీతి అక్రమాలను బయటపెట్టి వారి ఆక్రమార్జనకు అడ్డు కట్టలు వేసింది. పెద్దాయన నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు అంటే ఎన్నో మంచి పనులు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కీర్తి గడించారు, ఆ పెద్దాయన పరువు తీయడానికి ఈయన ఎమ్మెల్యే అయినట్టు ఉన్నాడు. ఆ ఇంటి పేరును కుటుంబానికి ఉన్న మర్యాదను అంతా మంట గలుపుతున్నాడు. ఈ మతిభ్రమించిన ప్రసన్న కోవూరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యం అని మరచి ప్రతి గడపకి తిరిగి ఓట్లు అడుగుతున్నారు. సిగ్గుండాలి.. ఏం అభివృద్ధి సాధించాలని మీరు మళ్ళీ మా ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు, నియోజక వర్గ ప్రజల శ్రేయస్సు గాలికి వదిలి కనిగిరి రిజర్వాయరు వద్ద కృత్రిమంగా అడ్డుగా కట్ట గా నిలిచిన గ్రావెల్ను 40అడుగుల మేర తోవ్వేశారు రేపు వరదలు వస్తే 18 గ్రామాలు ముంపుకు గురై ప్రజల ప్రాణాపాయ పరిస్థితి ఉంది. ప్రజల ప్రాణ హాని ఉందని తెలిసినా చీమకుట్టనట్టు ఉండే మీరు ఏ ఉద్దేశంతో ప్రజలను మరల మా ప్రభుత్వానికి అవకాసం ఇవ్వాలని ఎలా అడుగుతున్నారు. మీ పెత్తందారులు దుర్మార్గాలకు బలి అవుతున్న ప్రజలు మరొక్కసారి మీకెందుకు అవకాశం ఇవ్వాలి. అవినీతిని ప్రశ్నించినందుకు మీ అనుచరులు జర్నలిస్టుల పైన దాడులు మర్చిపోలేదు. సొంత సంపాదన నుంచి కోట్ల రూపాయల కౌలు రైతుకి ఇస్తున్న మా ప్రజా ప్రతినిధి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ, పేద బిక్కి పంటలు పండించుకుంటున్న స్థలాలను ఆక్రమంగా స్వాధీన పరుచుకుని అక్రమ గ్రావెల్ రవాణా చేసి దార్లు చేస్తున్న మీరు ఎక్కడ. ఆయన గురించి మాట్లాడే స్థాయి కూడా మీకు లేదు. అక్కడికేదో కాపు కులాన్ని మొత్తం మీరుద్దరించినట్లు మాట్లాడుతున్నారు. ముద్రగడ గారు మీరు సమర్థించే ముందు ఆయన అడిగిన రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు. ఆయన గురించి ప్రస్తావించే ముందు మాకు గత ప్రభుత్వాలు ఇస్తానన్న ఐదు శాతం రిజర్వేషన్లు ఎందుకు ఎత్తివేశారుజవాబివ్వ గలరా.. కాపు బిడ్డలకి విదేశీ విద్య రుణాలు ఎందుకు ఇప్పించలేకపోతున్నారు. కుల మతాలకతీతంగా అందరూ జగన్ని ఆరాధిస్తున్నారా..? ఎందుకు ముస్లిం షాది తోఫా ఎగ్గొట్టినందుకా, ఎస్సీ ఎస్టీ వాళ్లకి రుణాలు ఇప్పించలేనందుకా, గిరిజన స్థలాలను కొట్టేస్తున్నందుకా, వారిపై దాడి చేస్తున్నందుకా.. రైతు భరోసా కేంద్రం రైతులకు అండగా నిలవలేనందుకా.. దేవుడు దిగొచ్చినా కూడా మీ జగన్ పతనాన్ని ఆపలేడు, అభివృద్ధి జరగాలన్నా, ఈ అరాచకం ఆగాలన్నా, జనం బాగుండాలన్నా ఈసారి వైసీపీకి చెమర గీతం పాడాల్సిందే.. హల్లో వై సిపీ బై బై వైసిపి..అంటూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో పాటు జిల్లా కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు సుధీర్ బద్దిపూడి, ఖలీల్, వర్షన్, సుమంత్, హేమచంద్ర యాదవ్, షాజహాన్, మౌనిష్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.