పార్టీ బలపడడం చూసి ఓర్చుకోలేక విమర్శలు చేస్తున్నారు

అన్నమయ్య జిల్లా రాజంపేట నందలూరు మండల జనసైనికుల ఆధ్వర్యంలో పత్రికా విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఇందులో జనసేన పార్టి రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పాల్గొన్నారు. మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వారంరోజులుగా కొత్త మంత్రి పదవులు తీసుకున్న మంత్రులు పరిపాలన పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ ని తిట్టడమే పరిపాలనగా పెట్టుకున్నారు. రాష్ట్రములో ఈ ప్రభుత్వం వచ్చినప్పటినుంచి అభివృద్ధి ఏమాత్రం జరగలేదు. అలాగే నియోజకవర్గ సమస్యలు తీసుకుంటే మండలంలోని ఆల్విన్ కర్మాగారం అలాగే రైల్వే లోకోషేడ్ వాటి స్థానంలో యువతకి ఉపాది కలిగించే విధంగా చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చారు. ఇంతవరుకు నెరవేర్చలేదు అలాగే ఈ మధ్యకాలంలో అందరికి తెలిసిన విషయమే అన్నమయ్య ప్రాజెక్ట్ ఆనకట్ట తెగిపోవడం వలన తోగురుపేట, మందపల్లి, పులపత్తూరు ఇంకా చిన్నపాటి గ్రామాలు ప్రజలు చాలా ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరిగింది. దీనికి సంబందించి స్వయాన ముఖ్యమంత్రి గారే వచ్చి సందర్శించారు వారు ఇచ్చిన హామీలు ఇంతవరుకు పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. ఇలా నియోజకవర్గ స్థాయి సమస్యల గురించే పటించుకోడంలేదు ఇది సరిపోదు అనట్లు ఈ కొత్తమంత్రులు వారి శాఖల పనితీరు మరియు వారి శాఖల గురించి సరిగా అవగాహన లేదు కానీ వారికి పదవులు తీసుకునపుడు నుంచి పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగత విమర్శలు చేయడమే సరిపొయిందని ఇక మీదటయినా వ్యక్తిగత విమర్శలు మానాలి అని లేని పక్షంలో ఘాటుగా సమాధానం చెప్తామని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో చనిపోయిన కౌలు రైతులకు 30 కోట్లతో మూడు వేల మందికి ఒక లక్ష చొప్పున చనిపోయిన కౌవులు రైతులకు ఆర్థిక సహాయం చేస్తూ ప్రజల్లో పార్టీ బలపడడం చూసి ఓర్చుకోలేకుండా పవన్ కళ్యాణ్ ని విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంపైన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ చట్టబద్ధంగానే పెళ్లి చేసుకున్నారని మీలాగా అక్రమాస్తులు అవినీతి చేసి జైలుకు వెళ్లలేదని వారు చేసిన విమర్శలపైన రాజంపేట నియోజకవర్గం నందలూరు జనసేన నాయకులు మరియు జనసేన పార్టి రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ఘాటుగా సమాధానం చెప్పారు. ఈ కార్యక్రమంలో టంగుటూరు ఈశ్వరయ్య, కళ్యాణ్, సుబ్బయ్య, తిప్పాయపల్లి ప్రశాంత్, మంకు వెంకటేష్, జయరామ్, ఆవుల సాయి, ప్రకాష్, ఎద్దల నరసింహ, ఉపేంద్ర, గురివిగారి వాసు తదితరులు పాల్గున్నారు.