నార్పల జనసేన ఆధ్వర్యంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం, నార్పల మండలంలో జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శ్రీ సత్య సాయి ధ్యాన మండలిలోని అనాధ శరణాలయంలో అట్టహాసంగా జరిగాయి. ముందుగా పిల్లతో కలిసి జనసేన నాయకులు, జనసైనికులు కేక్ కట్ చేసి పిల్లలందరికీ పంచిపెట్టారు. మండల కన్వీనర్ గంజికుంట రామకృష్ణ మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా దేశంలో నీతి నిజాయితీలతో నడుపుతున్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా జనసేన పార్టీనే అన్నారు . పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తన విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని బడుగు, బలహీన వర్గాలు దగా పడుతుంటే, ఆడపిల్లలకి రక్షణ కరువైన స్వార్థ రాజకీయాలతో ఆంధ్రరాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే చూడలేక పార్టీ పెట్టి నీతివంతమైన పాలన అందించాలని రాజకీయాలలోకి వచ్చారన్నారు.నేడు దేశంలోనే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అమలు చేసింది జనసేన పార్టీ అని గర్వంగా చెప్పుకున్నారు. కార్యకర్తల శ్రేయస్సు కోసం 5 లక్షల ప్రమాద భీమా పథకాన్ని తీసుకొచ్చారన్నారు. సీనియర్ నాయకులు తుపాకుల భాస్కర్ మాట్లాడుతూ మనందరికి ఈరోజు పండుగదినం అన్నారు . ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రజలందరూ ఒక పండుగలా జరుపుకునే రోజు తొందరలో వస్తుదన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన టిడిపి అభ్యర్థులకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించి జనసేన టిడిపి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలని కోరారు. పవన్ కళ్యాణ్ నిర్ణయాలను గౌరవిస్తూ ఆయన అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. వచ్చేది మన ప్రభుత్వమే అని, అన్ని వర్గాలవారికి, పార్టీలో శక్తివంచన లేకుండా పని చేసిన ప్రతి ఒక్కరిని గుర్తించుకొని వారికి పార్టీలో తగిన గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత అన్నవితరణ కార్యక్రమం లో పాల్గొని పిల్లలకు వడ్డించి, వారితో పాటు అందరూ సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఉన్న తోట రామయ్య, వినోదంనారాయణస్వామి, షేక్ రహంతుల్లా, నీలూరి జయంతి, రాయదుర్గం తేజలక్ష్మి, గంజికుంట సోమనాథ్, రమణ, అనిల్, ఆలీ, వినోదం లోకేష్, గిరీష్, రమణయ్య, హరీష్, పవన్, సంగా అశోక్, కుళ్లాయప్ప, హరి, రాముతో పాటూ పెద్దసంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.