జనసేన పార్టీకి బ్రహ్మరథం పడుతున్న ఆలూరు నియోజకవర్గ ప్రజలు
*జనసేన తేర్నెకల్ వెంకప్పకి ఘన స్వాగతం.
కర్నూల్ జిల్లా, ఆలూరు నియోజకవర్గం, దేవనకొండ మండలంలోని నెల్లిబండ గ్రామ దేవత పెద్దమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణానికి రూ. 25,000/- అందించిన ఆలూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ వెంకప్ప. దేవనకొండ మండలంలోని నెల్లిబండ గ్రామ జనసైనికులు మరియు ప్రజలు ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ తేర్నెకల్ వెంకప్ప కి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పెద్దమ్మ అవ్వ దేవర సందర్భంగా వెంకప్ప అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లిబండ గ్రామ పెద్దలు, మండల నాయకులు మరియు జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-30-at-7.30.47-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-30-at-7.30.47-PM-1-1024x486.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-30-at-7.30.46-PM-1024x576.jpeg)