తిరుపతి ప్రజలను ఆ ఏడు కొండల వాడే కాపాడాలి: కిరణ్ రాయల్

తిరుపతి, టీటీడీ వైకుంఠ ఏకాదశికి వీవీఐపీలకు ఇష్టారాజ్యంగా దర్శనాలకు అనుమతులను ఇచ్చి సామాన్య ప్రజలను క్యూలైన్లలో ఇబ్బందులకు గురిచేసి ఈ కరోనా తీవ్రతకు కారణమయ్యారని తిరుపతి ప్రజలు అంటే అధికార పార్టీకి – అధికారులకు ఎందుకు అంత చిన్న చూపు…? ముందే హెచ్చరించినప్పటికీ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారని కిరణ్ రాయల్ అన్నారు.

కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. తిరుపతి ప్రజలు ఇబ్బందులకు గురవుతారు తగు జాగ్రత్తలు తీసుకోండి అని ముందే జనసేన పార్టీ హెచ్చరించినప్పటికీ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించి ఈరోజు టిటిడి దేవస్థానం ఎంప్లాయిస్ లలో సగం మందికి పైగా పోలీసువారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, డాక్టర్లు, తిరుపతిలో లక్ష మందికి పైగా జ్వరాలతో అల్లాడిపోతూ ఎప్పుడు ఏమవుతుందోనని భయభ్రాంతులకు గురవుతున్నారు దీనికి కారణం ముమ్మాటికి అధికార పార్టీ, అధికార యంత్రాంగమేనని… కొందరు బాధితులు టెస్టు చేయించుకుందామని స్విమ్స్లో గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ అక్కడ అధికారులు ఇక్కడ టెస్టింగ్ కి సంబంధించినటువంటి కిట్లు అందుబాటులో లేవని వారిని వెనక్కి పంపించి తలుపులు మూసి వేయడం ఎంతవరకు సమంజసం? అధికార యంత్రాంగం అధికార పార్టీ ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి ఈ తిరుపతి ప్రజలను ఆ ఏడు కొండల వాడే కాపాడాలని.. వైరస్ నుంచి జ్వరాల నుంచి తిరుపతి ప్రజలను వెంటనే కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని తిరుపతి జనసేన పార్టీ తరపున మరొక్కసారి డిమాండ్ చేస్తున్నామని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గం ఇంఛార్జ్ కిరణ్ రాయల్ తెలిపారు.