ఆరణికే పట్టం కడతామంటున్న తిరుపతి వాసులు

  • జనసేనలోకి కొనసాగుతున్న చేరికలు
  • అభివృద్ధి చేసి ఉంటే, ఓటమి భయమెందుకంటున్న రాజకీయ విశ్లేషకులు..

తిరుపతి: తిరుపతిలో గత కొద్ది రోజులుగా జనసేన పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు. గతంలో ప్రజారాజ్యం పార్టీకి పనిచేసిన కీలక నేతలు, మెగా అభిమానులు, వైసిపి కార్పొరేటర్లు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున జనసేనలో చేరుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్రంతో పాటు తిరుపతి నియోజకవర్గంలో కూడా.. ప్రభుత్వం మారాలని, రాష్ట్రం , అభివృద్ధి కి, ఉపాధి కి, రాజధాని కి నోచుకోకపోవడం ఒకటైతే.. గతంలో చిత్తూరు జిల్లా ప్రజారాజ్యం పార్టీ జిల్లా అధ్యక్షునిగా ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు వ్యవహరించి ఉండడం మరొకటి. ఈ చేరికలను గమనిస్తున్న, జగన్ మోహన్ రెడ్డి, భమన కరుణాకర్ రెడ్డి పరిపాలనతో విసుకు చెందిన స్థానిక ప్రజలు ఈసారి కచ్చితంగా “ఆరణికే” పట్టం కడతామని, కొద్దిరోజులుగా ఏ ప్రచారంలో చూసిన ఎన్డీఏ కూటమి శ్రేణులకు ఎదురొచ్చి మరి హామీ ఇవ్వడం చూస్తుంటే జనసేన విజయం తథ్యమని అర్థమవుతుంది. ప్రతి ఇంటికి మంచి చేశామని, దేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నామని, అందుకే వై నాట్ 175 కి 175 అనే ధీమా వ్యక్తం చేస్తున్నప్పుడు, ఎన్డీఏ కూటమిని చూసి ఎందుకు భయపడుతున్నారని, కూటమి అభ్యర్థుల ప్రచారాలను ఎందుకు అడ్డుకుంటున్నారని, నిన్న సృజనా చౌదరిపై దాడి చేయడం ఏంటని, అభివృద్ధి చేసి ఉంటే మీరు ఇంట్లో కూర్చున్న ప్రజలు మీకు ఓట్లు వేస్తారు కదా అని, ఈ దౌర్జన్యాలకు ఎందుకు పాల్పడుతున్నారని టీడిపి, బిజెపి, జనసేన నేతలు ప్రశ్నాస్త్రాలు విసురుతున్నారు. వైఎస్ఆర్సిపి పార్టీ అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారే తప్ప ఎక్కడా అభివృద్ధి జరగలేదని, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈసారి అధికారం కోసం ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా మూడు పార్టీలు వాటిని దీటుగా ఎదుర్కొంటాయని, మూడు పార్టీల కార్యకర్తలు కూటమి గెలుపుకు సాయశక్తులా కృషి చేస్తామని తేల్చి చెప్తున్నారు.