పాలన చేతగాని వైసీపీ పాలకులకు అవినీతి చేయడమే రాజకీయ లక్ష్యం

సింగనమల నియోజకవర్గం: మన రాష్ట్రంలో పాలన చేతగానటువంటి ఈ వైసీపీ పాలకులు అవినీతి చేయడమే వీరి రాజకీయ లక్షణమని సింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు మండల జనసేన నాయకులు పేర్కొన్నారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజా దోపిడీ చేయడమే వీరి అర్హత అనేటువంటి కొన్ని లక్షణాలతో ప్రజలను ఏమారుస్తూ సంక్షేమం అనే ముసుగులో బ్రష్టు పట్టిస్తున్నారు. ఈ పాలకుల వైఫల్యాలను మా జనసేన పార్టీ అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారాహి రథంపై ప్రజలకు తెలుపుతుంటే ఈ వైసీపీ పాలకుల దురాగతాలను ప్రజలు తెలుసుకుని చైతన్య పడుతుంటే ఇక వీరికి అధికారం దూరమవుతుందని భయంతో ఓర్వ లేనటువంటి కొంతమంది వైసీపీ నాయకులు ప్రజలను రాక్షసుల్లా పీడించుకొనితినడమే రాజకీయం అన్నట్టు ఉండే ఈ అవినీతి వైసిపి నాయకులు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై రాజకీయ నాయకుడు కాదు రాజకీయంకు తరం కాడు అనేటువంటి కుంచపు బుద్ధి గల మాటలు మాట్లాడే ఈ మంత్రులు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చవిచూడక తప్పదు. ఈ వైసీపీ పాలకులు వాలెంటీర్లు అనే కొంతమంది యువకులను ఐదువేల రూపాయలు ఇచ్చి మోసం చేస్తూ వారితో కొన్ని అవాంఛనీయ సఘటనలు చేయిస్తూ ఉంటే.. ఆ వాలంటరీ వ్యవస్థలోని లోపాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎత్తి చూపారని వీరు అవినీతి బండారం బయటపడుతుందని వైసీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. వీరికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వాలంటరీ వ్యవస్థలో తప్పు చేసిన వారిని శిక్షించి ఆ వ్యవస్థను బాగుపరిచి సమాజానికి మేలు చేసే విధంగా చేయాలి కానీ తప్పులు చేసేవారిని అవినీతి చేసే వారిని ప్రోత్సహిస్తూ కమిషన్లు తినే ఈ ఎమ్మెల్యే మంత్రులు ఈ రాష్ట్రానికి పాలకులుగా తరం కారని మాలాంటి సింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు మండలంలో ప్రజలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అగ్రవర్ణాల చేతిలో నలిగిపోతున్నారని, ఫ్యాక్షనిస్టు కుటుంబాల స్వార్థాలకు పుట్లూరు మండలంలోని పేదవాడి జీవితాలు బలవుతున్నాయని ఇంతవరకు మా మండలంను పట్టించుకున్న పాపాన ఏ పార్టీ పోలేదని జనసేన పార్టీ అధికారంలోకి వస్తే కానీ మాలాంటి పేదలకు న్యాయం జరగదని భావిస్తున్నామని తెలిపారు. వీరు చేసే దురాగతాలను చూసి విసిగి వేసారిన ప్రజలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నీతి నిజాయితీపరుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలిపి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ప్రభుత్వ పాలన వస్తే కానీమనలాంటి వారి జీవితాలు బాగుపడవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పుట్లూరు మండల జనసేన నాయకులు వెంకట శేఖర్, వి సురేష్, రాజా, మరియు సుభాన్ తదితరులు కలిసి పుట్లూరు మండల ప్రజలకు తెలిపారు.