ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికారం జనసేనదే: గాదె

ప్రస్తుతం వైసీపీ నేతల నేతృత్వంలో రాష్ట్రంలో రావణరాజ్యం నడుస్తుందని.. క్షేత్రస్థాయిలో ప్రజల జీవనవిధానం అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా మద్దతుతో పవన్ కల్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీ అధికారాన్ని చేపట్టబోతుందని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వాలను నమోదు చేయించిన జనసైనికులను శనివారం పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. జనసేన పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా మూడున్నర లక్షల మంది క్రియాశీలక సభ్యులు చేరటం ఎంతో ముదావహం అన్నారు. ప్రతీ క్రియాశీలక సభ్యుడు పార్టీ సిద్దాంతాలనూ, పవన్ కళ్యాణ్ భావజాలాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఎన్నికలు ఒక సంవత్సరం ముందుగానే వచ్చే అవకాశం ఉన్న నేపధ్యంలో ప్రతీఒక్కరూ రోజులో కొంత సమయాన్ని పార్టీ బలోపేతానికి కేటాయించాలని కోరారు. మరో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ.. ప్రతీ కార్యకర్తని తన కుటుంబ సభ్యునిగా పవన్ కళ్యాణ్ చూసుకుంటారని.. వారికి ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటారన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చటంలో క్రియాశీలక సభ్యులదే కీలకపాత్రన్నారు. అనంతరం ఎక్కువమంది సభ్యుల్ని చేర్చిన నెల్లూరి రాజేష్, చేజేర్ల శివ, మిద్దె నాగరాజు, అందే వెంకటేశ్వరరావు, యడ్ల రాధికలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అడపా మాణిక్యాలరావు , ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, అధికార ప్రతినిధి ఆళ్ళ హరి తదితరులు పాల్గొన్నారు.