ది పవర్ ఆఫ్ జనసేన లోడెడ్ విత్ చిరంజీవి యువత ర్యాలీ

నెల్లూరు: జనసేన పార్టీ సిటీ నిర్దేశకులు వేములపాటి అజయ్ ఆధ్వర్యంలో చిరంజీవి యువత మరియు మెగా అభిమానులు జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఒక్కటిగా ఉన్నారని తెలియజేస్తూ.. విఆర్ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండు పిల్లుల మధ్య తగువుపెట్టి రొట్టెముక్క ఎత్తుకుపోతుంది ఒక కోతి, ఇది చిన్నప్పుడు విన్న నీతి కథ. ఆ నీతి కథలు మేమూ విన్నాం మా నాయకులు అమాయకులు కాదు. మిత్రపక్షాలైన రెండు పార్టీల అభ్యర్థుల మద్య తగువు పెట్టి మీరేదో లాభపడాలి అనుకోవడం పొరపాటే వైసిపీ నాయకులారా, అధికారమే పరమావధిగా వచ్చిన వైసీపీ నాయకులు ప్రజల ఆదరణకు నోచుకోలేకపోయారు. ఎగిరిపోతే ఎంత బాగుంటుందని పాట ప్రస్తుతం వైఎస్ఆర్సిపిలో ఎమ్మెల్యేలు ఎంపీలు పాడుతున్నారు. నాలుగున్నర సంవత్సరం చేసిన పాపాలు చాలు ఇక ఎగిరిపోతామని వెళ్ళిపోతుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫ్యూజ్ లు ఎగిరిపోతున్నాయని బయట టాకు.. కేవలం అధికారం పదవులే కాకుండా సేవ చేయడానికి వచ్చిన జనసేన నాయకులను జనసేన పార్టీని ఆదరించవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. జనసేన పార్టీ విభాగాలైన చిరంజీవి యువత, అఖిల భారత చిరంజీవి యువత, మెగా వారసుల అభిమానులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయం ఆచరించటానికి సిద్ధంగా ఉన్నారు. రాజ్యాధికారానికి నోచుకోని అనేకమంది పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నారు. వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటిదాకా చేసిన అభివృద్ధి చూసుకోవాలి కానీ పక్క పార్టీలు వేలెత్తి చూపించే పరిస్థితి మీకు లేదని మనవి చేసుకుంటూ.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ అధికారం సాధించబోతున్నాయి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి.. వీటికి మేమందరం కూడా సంసిద్ధులు గా ఉన్నామని తెలియజేస్తూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, చిరంజీవి యువత నాయకులు జనసేన జిల్లా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి, చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు జనసేన సీనియర్ నాయకులు రవికుమార్, అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు జనసేన సీనియర్ నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, రామ్ చరణ్ యువత జిల్లా ప్రెసిడెంట్ ప్రసాద్, వరుణ్ తేజ్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు గుర్రం కిషోర్, చిరంజీవి యువత అధ్యక్షులు ఈగి సురేష్, నెల్లూరు జిల్లా లీగల్ ఇంచార్జ్ జనసేన పార్టీ లీగల్ ఇంచార్జ్ చదలవాడ రాజేష్, కాప్ రాక్స్ పిఆర్ఓ పసుపర్తి కిషోర్, నెల్లూరు సిటీ ఇన్చార్జి శివ, కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు సుధామాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొణిదల సందీప్, కె.ఎస్.ఎస్ నాయకులు సాయి, సుధీర్, జనసేన జిల్లా సెక్రెటరీ ప్రశాంత్ గౌడ్, వీరమహిళ నాయకురాళ్ళు నాగరత్నం, కృష్ణవేణి, రేణుక, హసీనా, భారతి, హేమచంద్ర యాదవ్, కేశవులు, వర్షన్, తదితరులు పాల్గొన్నారు.