రామ్ చరణ్ పెట్టుకొనే వాచ్ ధర కోటికి పైమాటే..!
ఇండస్ట్రీలోకి రావడానికి వారసత్వం కారణమైనప్పటికీ తన నటనా కౌశలంతో ప్రేక్షకులను మెప్పించి ఎంతోమంది హృదయాల్లో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు రామ్ చరణ్. నటనతోనే కాకుండా తన హుందా ప్రవర్తనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.
రాంచరణ్ ఉన్నత విలువల కారణంగానే అతనికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాంచరణ్ సినిమా ఓపెనింగ్స్ రికార్ద్ స్థాయిలో నమోదవుతూ ఉండడానికి కారణం అతని డౌన్- టు-ఎర్త్ మనస్తత్వం వల్లనే అని చెప్పాలి. రాంచరణ్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. రాంచరణ్ మరియు ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదలవుతున్న విషయం తెలిసిందే.
ఇది ఇల ఉంటె రాంచరణ్ ని యూత్ ఐకాన్ అని కూడా చెప్పొచ్చు. అతను వేసుకునే షూస్, డ్రెస్ లు అంత స్టయిలిష్ గా ఉండటమె కారణం. చరణ్ సినిమా వేడుకలకుకు హాజరైనపుదు అతని డ్రెస్సింగ్ స్టైల్ ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే అతనికి వాచ్ లు అంటే చాలా ఇష్టం అన్న విషయం బహుశా అతి కొద్ది మందికి మత్రమే తెలుసెమో. చరణ్ షాపింగ్ చేస్తే ఎక్కువగా వాచ్ లనే కొనుగోలు చేస్తూ ఉంటాడట. చరణ్ దగ్గర ఇప్పటి వరకూ ఎన్నో ఖరీదైన వాచ్ లు ఉన్నాయట. ఆ వాచ్ లు మరియు వాటి ధరల వివరాలను తెలుసుకుందామా..?
ఈ క్రింది ఇచ్చిన వాచ్ ల వివరాలు కేవలం షో రూం ధర మాత్రమే ఐతె వాటిలొ కొన్ని ట్యాక్సులతొ కలిపితే కోటికి పైమాటేనట…!
1) పాటిక్ ఫిలిప్పి నాటిలస్ క్రోనోగ్రాఫ్ – రూ.68 లక్షలు.
2) హుబ్లాట్ కింగ్ పవర్ లిమిటెడ్ ఎడిషన్ – రూ.18 లక్షలు.
3) రిచార్డ్ మిల్లె ఆర్.ఎం.029 – రూ.85 లక్షలు.
4) ఆడమర్స్ పైగట్ రాయల్ ఓక్ ఆఫ్ షోర్ గ్రాండ్ ప్రిక్స్ – రూ.75 లక్షలు.
5) ఆడమర్స్ పైగట్ రాయల్ ఓక్ ఆఫ్ షోర్ లెబ్రాన్ జేమ్స్ – రూ.43 లక్షలు
6) ఆడమర్స్ పైగట్ రాయల్ ఓక్ ఆఫ్ షోర్ నేవి బ్లూ – రూ.22 లక్షలు
7) రోలెక్స్ యాక్ట్ మాస్టర్- 2 : రూ.13 లక్షలు