డబ్బు కోసం దేవుడి విగ్రహం ధ్వసం చేసిన పూజారి

డబ్బు ఏపనైనా చేయిస్తుందని అంత మాట్లాడుకుంటాం.. కానీ ఏకంగా దేవుడి విగ్రహాలు సైతం ధ్వసం చేయిస్తుందని ఏపీలో జరిగిన ఘటన బయటపెట్టింది. రాజమండ్రిలో ఈ ఏడాది జనవరి 1 న సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహాన్ని ధ్వంసం జరిగింది. ఈ ఘటన పట్ల పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తు లో ఆ ఆలయ పూజారే ఈ పని చేసినట్లు బయటపడింది. డబ్బు కోసమే ఇలా బరితెగించారని పోలీసులు తెలిపారు.

సదరు పూజారి వెంకట మురళి ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా తీసుకుని, రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను బట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే కొందరు ఆయనకు డబ్బు ఆశచూపారని వెల్లడైంది. డబ్బుకు ఆశపడే ఇలాంటి నేరానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.