రాష్ట్రంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు జనసేనతోనే పరిష్కారం

కాకినాడ సిటి: కాకినాడ సిటి జనసేన పార్టీ కార్యాలయములో పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనల మేరకు శనివారం జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ ఆధ్వర్యంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ పాల్గొన్నారు. రాష్ట్రంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు జనసేన పార్టీతోనే పరిష్కారం అవుతాయని, అలాగే వారికి ఇచ్చే పించనును ప్రభుత్వం 6వేలకు పెంచాలంటూ జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గతంలో వృద్ధులకు ఇచ్చే పింఛను జనవరి ఒకటి నుంచి వారికి 3వేలు ఇవ్వనుందన్నారు. 3వేలు ఇచ్చే దివ్యాంగులకు 6వేల రూపాయలు పెంచవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శుక్రవారం జరిగిన క్యాబినెట్లో దివ్యాంగులు సమస్యల గురించి చర్చించకపోవడం దారుణమని దివ్యాంగుల సమస్యలు పరిష్కారానికి మాట్లాడక పోవడం శోచనీయమని సత్య, శివ, కృష్ణలు ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగుల సంఘం నగర అధ్యక్షుడు కర్రి ఆదినారాయణ మాట్లాడుతూ దివ్యాంగులను నిర్లక్ష్యంగా చూస్తున్నారని వారు మరియు వారి కుటుంబ సభ్యుల ఓట్లు ఈ వై.సి.పి ప్రభుత్వానికి అక్క్రలేదా అని ప్రశ్నించారు, దివ్యాంగులు కూడా దేశ పౌరులే వారికి ఇదివరకు దాకా అమలు చేసిన సబ్సిడీ రుణాలు, ఇల్లు, 2016 హక్కుల చట్ట అమలు చేయాలన్నారు. దివ్యాంగుల పెళ్ళికానుకకు సంబంధించి ఉన్న నిబంధనను తొలగించి వారికి న్యాయం చేయాలని ఆదినారాయణ డిమాండ్ చేశారు. దివ్యాంగులకు పూర్తి న్యాయం జనసేన పార్టీ ద్వారానే జరుగుతుందని జనసేన నాయకులు చెప్పారు. ఈ సమావేశంలో దివ్యాంగుల సంఘం నగర అధ్యక్షులు కర్రి ఆదినారాయణ, మల్లాడి ఏసుబాబు, సత్తిబాబు, బలసాడి ఆది బాబు, గోవిందు, శ్రీనివాసు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, దివ్యాంగుల ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.