సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: జనసేన వినతి పత్రం

  • తిరుపతిలో తిరగాలంటే – తిరిగి ఇంటికి వెళతామా..? అనేలా ఉంది.
  • నగరంలో డ్రైనేజీ, రోడ్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి.
  • లేనిపక్షంలో కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం.. జనసేన.

తిరుపతి నగరంలో ఏ వీధిలో చూసినా డ్రైనేజీ నీరు పొంగి రోడ్లపై నగరవాసులను అనారోగ్య పాలు చేస్తున్నదని, దీనిపై తక్షణమే స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ అధికారులు స్పందించి, తిరుపతి స్మార్ట్ సిటీలో డ్రైనేజీ ప్రాబ్లంను, మరమ్మత్తులకు నోచుకోని రోడ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులకు జనసేన పార్టీ నేతలు రాజారెడ్డి, బాబ్జీ, రాజేష్ యాదవ్, సుమన్ బాబు, మునస్వామి, కర్ణం లక్ష్మి, సుమన్, పవన్, రాజేష్, హేమంత్, ఆదికేశవులు, సాయికుమార్, పురుషోత్తం రాయల్, సుజిత్, వెంకటేష్, పురుషోత్తములతో కలిసి మంగళవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్ల విస్తీర్ణంలో భాగంగా కూడా కొన్ని డివిజన్లో మురికి నీరు రోడ్లపై ప్రవహిస్తుండడంతో ప్రజల రాకపోకలలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మున్సిపల్ అధికారులు త్వరితగతిగా సమస్యలను పరిష్కరించని పక్షంలో కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని నగర అధ్యక్షుడు రాజారెడ్డి హెచ్చరించారు.