కనిమెట్ట గ్రామ సమస్యలను పరుష్కరించాలి.. జనసేన డిమాండ్

నెల్లిమర్ల నియోజకవర్గం, పూసపాటిరేగ మండలం, కనిమెట్ట గ్రామ పంచాయతీలో మంగళవారం నిర్వహించిన గ్రామసభలో జనసేన పార్టీ తరఫున పూసపాటిరేగ మండల అధ్యక్షులు జలపారి శివతో పాటు గ్రామ జనసైనికులు పాల్గొన్నారు. ఈ సభలో పంచాయతీలోని దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరారు. 10 సంవత్సరాలుగా కనిమెట్ట గ్రామాన్ని వేదిస్తున్న త్రాగునీరు సమస్య ఒక నెలలో పూర్తి చేస్తామని ప్రజల సమక్షంలో తీర్మానం. ప్రభుత్వ నీటి సరఫరాకు వినియోగించే ట్యాంక్ క్రింద భాగంలో, ప్రాధమిక పాఠశాల ఆవరణలో మరుగునీరు నిల్వ ఉండటాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని తీర్మానం. ఇంటి బిల్లులు మంజూరులో గణాంకాల వివరణ. కాలువల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. గుండపురెడ్డిపాలెం గ్రామంలో డంపింగ్ యార్డు నిర్వహణాలోపాలను సవరించుకోవాలని కోరడం జరిగింది.