ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో సందడి చేసిన రియల్ హీరో

రీల్ లైఫ్ లో చేసేది విలన్ పాత్రలే అయినా రియల్ లైఫ్ లో మాత్రం రియల్ హీరో అనిపించుకున్న సూపర్ హీరో సోనూ సూద్. లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులను అక్కున చేర్చుకొని.. ఎంతో మందికి అండగా నిలిచారు అది అక్కడితో ఆపకుండా ఇప్పటివరకూ కష్టాలు చెప్పుకున్న ప్రతి ఒక్కరికి లేదనకుండా సాయం చేస్తూనే ఉన్నారు. ఇటీవల సోనూసూద్ కు తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో గుడి కట్టించిన సంగతి తెలిసిందే. తాజగా హైదరాబాద్ లోని బేగంపేట కు చెందిన అనిల్ అనే యువకుడు తన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు ‘లక్ష్మీ సోనూ సూద్‌ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌’అని పేరు పెట్టడం జరిగింది. సోను సూద్ పేరు పెట్టడంతో తనకు బిజినెస్ రెట్టింపు అయ్యిందని అనిల్ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సోనూ.. ఆ ఫుడ్‌ కోర్టును సందర్శించేందుకు రాగా అనిల్‌ ఘనస్వాగతం పలికాడు. ఈ సందర్భంగా సోనూ తానే స్వయంగా ఎగ్‌ ఫ్రైడ్‌రైస్‌ను తయారు చేసుకుని ఆరగించారు.