మరో చిన్నారి ప్రాణాల్ని నిలిపిన రియల్ హీరో…?

లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి వలస కూలీలను ఆదుకుంటూ ప్రజల దృష్టిలో రియల్ హీరోగా మారారు సోనూ సూద్. లాక్ డౌన్ ముగిసినప్పటికీ సోనూ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తాను స్వయంగా తెలుసుకున్న తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడంతో పాటు కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. తాజాగా ఓ చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించి మరోసారి తాను రియల్ హీరోనని నిరూపించుకున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా అన్నదేవరపేట కి చెందిన రామన వెంకటేశ్వరరావు దేవీ అనే కూలీ దంపతులకు నేను ఎనిమిది నెలల కుమారుడు గుండెకు సంబంధించిన వ్యాధితో కొద్ది రోజులుగా బాధపడుతున్నాడు. వారికి వైద్యం చేయించేందుకు తగిన స్తోమత లేక ఆ తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు సోనూ సూద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రస్ట్ ని సంప్రదించాడు. ఆ తర్వాత బాధిత తల్లిదండ్రులు ముంబైకి వెళ్లి స్వయంగా సోనూసూద్ ని కలిసి తమ బిడ్డ సమస్య గురించి వివరించారు. దీంతో సోనూ వెంటనే చిన్నారిని ముంబైలోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చేర్పించారు. ఆపరేషన్ కు అయ్యే ఖర్చును తానే భరించాడు. చిన్నారి ప్రాణాల్ని నిలిపిన సోనూ మంచి మనసుపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.