దివ్యాంగ వాలుంటీర్ పై అధికార పార్టీ జులుం

రైల్వే కోడూరు నియోజకవర్గం: చిట్వెల్ మండలం, శిద్దారెడ్డి పల్లికి చెందిన నూకరాజు సందీప్ యాదవ్ దివ్యాంగుడి కోటాలో వాలంటీర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ మధ్య తన సెల్ ఫోన్ స్టేటస్ లో మోడి గారి ఫోటో పెట్టుకున్నాడని, ఆఫీసు నుంచి మెమో ఇచ్చారు. దానికి జవాబు కూడా నేను ఏ విధమైన తప్పు చేయలేదని నాపైన ఒక్క లబ్దిదారుడు ఫిర్యాదు కూడా లేదని ఇచ్చినా అతని ఉద్యోగము తొలగించారని సమాచారం అందుకున్న రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మరియు బీజేపీ స్టేట్ ఆర్టికల్చర్ సెల్ కన్వీనర్ తోట శ్రీనివాసులు, మరియు బిజెపి నాయకులు జనసేన నాయకులతో కలిసి స్థానిక సెక్రెటరీని మరియు ఎం డి ఓ ను కలిసి అతని ఫోన్లో అతను ఎవరి ఫోటో పెట్టుకున్నా అది అతని ప్రాథమిక హక్కు అని అతనికి ఉద్యోగం తిరిగి ఇవ్వాలని, లేదంటే వారం రోజుల్లో అన్ని ప్రతిపక్షాలను కలుపుకుని ధర్నాకు పూనుకుంటామని చెప్పారు. ఈ విషయంపై ఎం.డి.ఓ స్పందిస్తూ.. అతని వివరణ తీసుకుని తిరిగి నియామక పత్రం ఇస్తామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కోడూరు మండల ప్రచారక్ దశరథ రామయ్య, అన్నమయ్య జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు రాకచర్ల సుబ్బారావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జయప్రకాష్ వర్మ, జనసేన నాయకులు పగడాల వెంకటేష్, మాదాసు నరసింహ, రైల్వే కోడూరు మండల కన్వీనర్ జోగినేని సుబ్బారావు, వరికూటి నాగరాజు, ఉమ్మడి కడప జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ నెంబర్ మాదాసు శివ, స్టేట్ కౌన్సిల్ మాజీ మెంబర్ శంకర్ రాజు, మండల కార్యకర్త నాగినేని బాలసుబ్రమణ్యం, జిల్లా కార్యవర్గ సభ్యులు చలపతి, ఓబీసీ రాష్ట్ర నాయకులు బట్టల సుబ్రమణ్యం, కార్యకర్తలు బాబు ఆచారి, మల్లికార్జున, చిట్వేలు మండలం నుంచి మండల విస్తారక్ బాబూజీ, మండల సీనియర్ కార్యకర్త ప్రసాద్ రాజు, నాగార్జున రెడ్డి, నరసింహులు, పెంచలయ్య, మల్లికార్జున మరియు బిజెపి కార్యకర్తలు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.