జనసేనలోకి చేరికల జోరు

పాలకొండ: జనసేన పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయక్రిష్ణ(ఎన్‌.కె జయకృష్ణ)ఆధ్వర్యంలో ప్రచారంలో గ్రామాలు నుంచి వైసీపీ విడిచిపెట్టి జనసేనలోకి చేరుతున్నారు. సోమవారం వీరఘట్టం మండలంలో నర్సిపురం గ్రామంలో ఎన్‌.కె.జయకృష్ణ సమక్షంలో వైసీపీ నాయకులు చింత శంకర్రావు, చింత కృష్ణ, చింత గోవిందరావు, దళపతి లక్ష్మీనాయుడు, అల్లు బలరాం నాయుడు, చింత చిన్నారావ్, గోల చిన్ననాయుడు, మరడాన త్రినాధ్ రావు, గోల శ్రీనివాసరావు, గోల గోవిందరావు, జనసేన పార్టీలో చేరారు. వీరికి జయకృష్ణ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంటరీ బీసీ సెల్‌ కన్వీనర్‌ పొదిలాపు కృష్ణమూర్తి వీరగొట్టం మండల పార్టీ అధ్యక్షులు ఉదయాన ఉదయభాస్కర్‌, మండల ప్రధాన కార్యదర్శి చింత ఉమా, టి ఎన్ టి యూ సీ అధ్యక్షులు నివార్తి శేషి, జనసేన జానీ, కర్రీ జగదీశ్, కర్రీ ఉమాహేశ్వరావు, పాలవలస సత్యం నాయుడు, చింత కృష్ణం నాయుడు, గణపతి లక్ష్మీనాయుడు, అల్లు బలరాం, బొత్స సురేష్ కార్తీక్, బంగారు కృపరావు, అఖిల్, కిరణ్, మరి ముఖ్యులు నాయకులు ఉమ్మడి పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.