సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (ఎస్.ఏ.టి.ఏ – సెంట్రల్) సంఘ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ, టూరిజం & కల్చరల్ మినిష్టర్ కందుల దుర్గేష్ ని మరియు ఒరిస్సా రాష్ట్ర భువనేశ్వర్ ఎంపీ & ఇంటర్ పార్లమెంటరీ బోర్డు వైస్ చైర్మన్ ఐన శ్రీమతి అపరాజిత సరంగిని కలిసి విదేశాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల సమస్యల గురించి మరియు విదేశాలకు వచ్చే ముందే, ఆయా వ్యక్తులు తమకు తాము తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించటంతో బాటు గల్ఫ్ దేశాల నుండి ఏపీ రాష్ట్రానికి నేరుగా విమాన సర్వీసులు ఉండాలని, ఏజెంట్లు చేసే మోసాలను అరికట్టడంలో ప్రభుత్వాలు చెయ్యవలసిన సహాయం, ఎయిర్పోర్ట్ లో ఇమ్మిగ్రేషన్ అయిన మరుక్షణం ఆ డేటా కేంద్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు డేటా బదిలీ చెయ్యబడేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకసారి దేశం విడిచి వెళ్ళిన వారి పూర్తి వివరాలు కేంద్రం నుండి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సంబంధిత వివరాలు బదిలీ అయ్యేలా ఉండాలని మరియు ఈ విషయాలపై ప్రజలకు సరైన విషయ పరిజ్ఞానం కలిగేలా ప్రభుత్వాలు, ఏజెన్సీలు సత్వర చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ, ఈ విషయాలను తమ అసెంబ్లీ, పార్లమెంట్ వేదికలపై చర్చించాలని కోరటం జరిగింది. దీనిపై స్పందించిన ఏపీ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మరియు శ్రీమతి అపరాజిత సరంగి తమ తమ వేదికలపై స్వరం వినిపించి ప్రభుత్వాలు స్పందించేలా తమ ప్రయత్నం చేస్తామని తెలుగు సంఘం ప్రతినిధులైన దుగ్గరపు ఎర్రన్న, యాకూబ్ ఖాన్, షౌకత్ అలీ మరియు ఒరిస్సా రాష్ట్రం నుండి వి.శ్రీరామ్ లకు భరోసా ఇవ్వటంతో, పాటు సౌదీ అరేబియాలో ఇబ్బందులు పడుతున్న తెలుగు మరియు ఇతర రాష్ట్రాల వ్యక్తులకు చేస్తున్న సహాయ, సహకారాలపై సంఘం ప్రతినిధులను అభినందించటం జరిగింది. కర్మ భూమిపై చేస్తున్న సామాజిక సేవలను జన్మభూమికి కూడా విస్తరించాలని, అది మీ బాద్యత అని నొక్కి చెప్పటం జరిగింది. తమ విన్నపాలను ఎంతో శ్రద్ధగా విని, ప్రోత్సహించిన మంత్రి, ఎంపీలను సంఘ ప్రతినిధులు కొనియాడుతూ తమ సంతృప్తిని వ్యక్తం చేసారు.

Share this content:
Post Comment