పాత ప్రభుత్వ ఛాయలు వెంటనే తొలగించాలి!

*ఊరిలా మారిన ప్రభుత్వానికి గుర్తింపులు మారలేదా?”
*అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే బత్తుల ఆగ్రహం

కోరుకొండ మండలం వెస్ట్ గానుగూడెంలో రైతు సేవా కేంద్రంలో మాజీ సీఎం ఫోటో ఉండడంపై రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారినా ఇప్పటికీ పాత ముఖ్యమంత్రి ఫోటో ఉంచడం అధికారుల నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నారు. వ్యవసాయ అధికారులు స్పందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, ఇంకా మాజీ ముఖ్యమంత్రి పేరుతో ఉన్న విలేజ్ క్లినిక్ పేరును మార్పు చేయకపోవడం పట్ల వైద్యశాఖ సిబ్బంది నిర్లక్ష్యాన్ని కూడా ఎత్తిచూపారు. ఈ విషయాన్ని డి.ఎం.హెచ్.ఓ మరియు కోరుకొండ మెడికల్ ఆఫీసర్‌లకు తెలుపామని, 48 గంటల్లో విలేజ్ క్లినిక్ పేరు మారకపోతే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment