బాటసారులకు దిశానిర్దేశం చేసిన కొడవలి జనసైనికుడు

కొడవలి గ్రామములో గత కొన్ని సంవత్సరాలుగా పోతులూరు, వాకపల్లి, శాంతి ఆశ్రమం గ్రామాలు ప్రయాణం చేసే ప్రయాణికులు కొడవలి గ్రామం వచ్చిన తర్వాత ఎటువేళ్ళాలో మార్గం తెలియక చాలా ఇబ్బంది పడేవారు. దానిని చాలా మంది గమనించినా ఎవరూ దానికి ఎటువంటి పరిష్కారం చూపలేదు కానీ కొడవలి గ్రామ ఒక జనసైనికుడు ముందుకు వచ్చి తన స్థోమతకు సరిపడ్డ బడ్జెట్ తో సుస్వాగతం కొడవలి గ్రామం పోతులూరు, వాకపల్లి, శాంతి ఆశ్రమం అంటూ బాణం గుర్తు చూపిస్తూ జనసైనికుడు, కొడవలి జనసేన పార్టీ నాయకుడు నక్క నారాయణమూర్తి ఒక బోర్డు పెట్టాడు.