పూడికలు తొలగించాలి.. జనసేన వినతి పత్రం

కలువాయి గ్రామంలో సైడ్ కాలువ పూర్తిగా మురికితో వ్యర్ధాలతో నిండిపోయింది. ఆ కాలువలో తక్షణమే పూడికలు తీయించమని జనసేన పార్టీ తరఫున సంబందిత అధికారులకు వినతి పత్రం అందించడం జరిగినది. ఈ మేరకు జనసేన నాయకులు మాట్లాడుతూ కాలువ పూడికలు తీయక పోవడంతో మురుగు నీరు నిలిచిపోయి దుర్గంధం ఎక్కువ వస్తోంది. చెత్త ఎక్కువ నిలువ చేయడం ద్వారా దుర్వాసన భరించలేక స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లల అయితే విష జ్వరాల పాలవుతున్నారు. కావున దయవుంచి మీరు తక్షణమే కాలువ పూడికలు తీయించమని జనసేన పార్టీ తరఫున అభ్యర్థిస్తున్నాం. పలుచోట్ల వీధిలైట్లు వెలగట్లేదు ఈ సమస్యలపై జనసేన పార్టీ తరఫున ఈ సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగింది. ఈ సమస్యలపీ అధికారులు స్పందిస్తూ ఒక రెండు మూడు రోజుల్లో చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యక్తులు కలువాయి మండల అధ్యక్షుడు పెరంకొండ మనోహర్, ఉపాధ్యక్షులు ఏటూరి హరి, గణేష్, టి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శులు, షేక్ మహమ్మద్ భాష, రవిచంద్ర, శ్రీను, గోవర్ధన్, కార్యదర్శిలు, కదిరి హరి, వంశి, కృష్ణ, షేక్ కాజా మురళి, విష్ణు సంయుక్త కార్యదర్శిలు, సురేష్, ప్రసాద్, హరి, నారాయణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.