రక్తపు మడుగులో ఉన్న గోమాతను రక్షించిన జనసైనికులు

గుడివాడ నియోజకవర్గం: గుడివాడ పట్టణ స్థానిక ముబారక్ సెంటర్లో గుర్తు తెలియని వాహనం రోడ్డుమీద సేదతీరుతున్న గోవు కాలు మీద వెళ్లడంతో తీవ్ర రక్తస్రావంతో అల్లాడుతున్న గోవును చూసి అక్కడ ఉన్న స్థానికులు గుడివాడ పట్టణ జనసైనికులకు తెలియజేయగా వెంటనే స్పందించి పశు వైద్యుడుని సంప్రదించి తగిన చికిత్స చేయించి గోవును రక్షించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ నోరులేని మూగజీవాలను రోడ్లమీద వదిలివేయడంతో ప్లాస్టిక్ వ్యర్ధాలు మరియు చెత్తచెదారం తిని రోడ్లు మీద సేద తీరడంతో అటు ప్రజలకు, వాహనదారులకు మరియు గోవులకు కూడా ఇబ్బందికరంగా ఉంటుందని ఈ సమస్యను అనేకసార్లు మునిసిపల్ అధికారులకు మరియు గుడివాడ పట్టణ పోలీస్ అధికారులకు కూడా తెలియజేశామని ఇప్పటికైనా చర్యలు తీసుకొని గోవు యాజమానిని పిలిపించి రోడ్లమీద గోవులు రాకుండా కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరారు. మన భారతదేశంలో ఎంతో పవిత్రంగా పూజింపబడే గోమాతకు ఇలాంటివి జరగడం చాలా దారుణమని మళ్లీ ఇలాంటివి జరగకుండా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సమాచారం అందించిన వెంటనే స్పందించిన కృష్ణాజిల్లా పశు వైద్య అధికారి దివాకర్ కు వైద్యం చేసిన డాక్టర్ చింతయ్యకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసి, విషయాన్ని శతఘ్ని న్యూస్ కు తెలిపారు.