మగువలే సృష్టికి మూలం: గాదె

గుంటూరు జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గళ్ళ మాధవి, టైమ్స్ ఆఫ్ ఇండియా వారిచే బెస్ట్ సర్వీస్ అవార్డు గెలుచుకున్న ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎం. కవిత, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్ళ మాధవి గారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉందని, మహిళా సాధికారత కోసం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆడబిడ్డ నిధి, మహిళలకు ఉచిత బస్సు, తల్లికి వందనం వంటి కార్యక్రమాలు, అలాగే పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి సబ్సిడీలు కూడా అందిస్తుందని వివరించారు. తదుపరి, టైమ్స్ ఆఫ్ ఇండియా బెస్ట్ సర్వీస్ అవార్డు గ్రహీత డాక్టర్ ఎం. కవిత మాట్లాడుతూ, కుటుంబాన్ని మరియు సమాజాన్ని తీర్చిదిద్దడంలో మగవలే కీలక పాత్ర పోషించాల్సిన బాధ్యత వున్నారని, సరైన పద్ధతిలో పిల్లలను పెంచడం ద్వారా సమాజం కూడా మంచిగా ఉంటుంది అన్నారు. ఇంతే కాకుండా, మనం స్త్రీలతో ఎలా ప్రవర్తించాలో మగ పిల్లలకు చెప్పాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాదె వెంకటేశ్వరావు మాట్లాడుతూ, “మగువలే సృష్టికి మూలం” అని అన్నారు. ఈ సృష్టి కేవలం వారు వలన నడుస్తుందని చెప్పారు. అలాగే, మహిళల కోసం ప్రత్యేక దినోత్సవం నిర్వహించడం మాత్రమే కాకుండా, ప్రతి రోజు మహిళల దేనని, వారు లేకుండా రోజు గడిచే పరిస్థితి లేదని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించి, పారిశ్రామికవేత్తలుగా, రాజకీయ నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. గాదె వెంకటేశ్వరావు గారు మరిన్ని వివరాలు తెలియజేస్తూ, జనసేన పార్టీ మహిళలు కోసం పెద్దపీట వేస్తుందని, పవన్ కళ్యాణ్ గారి ఇష్టంతో వీర మహిళా విభాగం ఏర్పాటు చేయబడిందని, మగవారికి సమానమైన అవకాశాలు కల్పించాలని చెప్పారు. వారు ఇటీవల గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో 16వ డివిజన్ కార్పొరేటర్ దాసరి లక్ష్మీ దుర్గని జనసేన పార్టీ తరపున స్టాండింగ్ కౌన్సిల్ నెంబర్‌గా ఎన్నుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు చందు సాంబశివరావు మాట్లాడుతూ, మహిళల పాత్ర సమాజ నిర్మాణంలో కీలకమని, వారు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారని, రాబోయే రోజుల్లో మరిన్ని రంగాల్లో పురుషులను మించి పోటీ చేసి విజయం సాధించాలని అన్నారు. ఈ వేడుకలో కృష్ణ పెన్న రీజినల్ మహిళా కో-ఆర్డినేటర్ బోనీ పార్వతి నాయుడు, కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు పాకనాటి రమాదేవి, జిల్లా ఉపాధ్యక్షులు బిట్రగుంట మల్లికా, మహిళా కార్పొరేటర్లు, జనసేన పార్టీ జిల్లా మరియు పట్టణ విభాగాల మహిళా నాయకులు, వీర మహిళలు, మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-03-08-at-6.59.49-PM-1024x458 మగువలే సృష్టికి మూలం: గాదె

Share this content:

Post Comment