ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికే జనసేన నాయకుల పోరాటం

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు: అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా. వంపూరు గంగులయ్య ఆదేశాల మేరకు, పాడేరు నియోజకవర్గం పరిధిలోని, సంతబయలు, గుత్తూరుపుట్టు, గబ్బంగి, అనసపల్లి, నేరేడివలస, అనేక ప్రాంతాల్లో పర్యటించిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు గడప గడపకు పర్యటించడం జరిగింది. రాష్ట్రాన్ని రావణ కాష్టం నుండి కాపాడాలని, అలాగే, ఈ నిరంకృష పాలనకు చరమగీతం పాడాలని, ఓటు అనే ఆయుధంతో ఈ వైసీపీ పార్టీనీ తరిమి తరిమి కొట్టాలని కోరారు.. అలాగే అరకు పార్లమెంట్, జనసేన, బీజేపీ, టీడీపీ, పార్టీలు బలపరిచిన శ్రీమతి కొత్తపల్లి గీత గారికి, మీ అమూల్య మైన అతి పవిత్రమైన ఓటు ముద్రను బ్యాలెట్లో 3వ నంబర్ గుర్తుపై వేసి, పాడేరు అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి గిడ్డి ఈశ్వరి గారికి, 2 వనంబర్ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండమెజరిటీతో గెలిపించాలని అభ్యర్థించిన పాడేరు ఎన్డీఏ కూటమి నాయకులు, అలాగే ఉమ్మడి పార్టీల మేనిఫెస్టో వివరించడం జరిగింది…ప్రజలు ఘనస్వాగతం పలికి ఉమ్మడి అభ్యర్ధులను గెలిపిస్తం అని తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపిన ఉమ్మడి నాయకులు. ఈ ప్రచారంలో జనసేనపార్టీ కాకినాడ రూరల్ ఐటీ టీమ్ కో ఆర్డినేటర్ సీ.హెచ్. అనిల్ కుమార్ జనసేన, పాడేరు మండల నాయకులు ముదిలీ. సుబ్బారావు, టీడీపీ జిల్లా కన్వీనర్. కోడ. సురేష్, టీడీపీ సర్పంచ్ బాబు రావు పడాల్, టీడీపీ మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీజేపీ నాయకులు, టీడీపీ మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.