ఘనంగా చంద్రగిరి నియోజకవర్గ మండల అధ్యక్షుల ప్రమాణస్వీకారోత్సవం

చిత్తూరు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జిల్లా కార్యదర్శులు శ్రీ మనోహర్, నాసిర్ ల ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఫాఛ్ సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ డా.పసుపులేటి హరి ప్రసాద్ విచ్చేసి నూతన మండల అధ్యక్షులకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గ మండల అధ్యక్షుల ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా హోటల్ కీస్ విహస్ లో జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శ్రీ పగడాల మురళి, శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ చిన్నా రాయల్, GD నెల్లూర్ ఇంఛార్జి శ్రీ డా.యుగంధర్ పొన్నా, జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి కంచి శ్యామల, జిల్లా యువ నాయకులు పార్ధు, పగడాల యువరాజ్, హేమంత్, రవి కొర్లగుంట, కుమార్ చెన్నారెడ్డి కాలని మరియు జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.