మావోయిస్టు పార్టీ, దాని అనుబంధ సంస్థలపై నిషేధాన్ని పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం

మావోయిస్టు పార్టీ, దాని అనుబంధ సంస్థలపై నిషేధాన్ని తెలంగాణ ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17వ తేదీ నుంచి ఉత్తర్వులు అమల్లోకి వచ్చినట్టు ప్రభుత్వం పేర్కొంది. మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాల్లో రైతు కూలీ సంఘం, రాడికల్ యూత్ లీగ్, రెవల్యూషనరీ డెమొక్రాటిక్ ఫ్రంట్, సింగరేణి కార్మిక సమాఖ్య, విప్లవ కార్మిక సమాఖ్య, ఆర్ఎస్యూ ఉన్నాయి.

ఇటీవలి కాలంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య తరచుగా ఎదురు కాల్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిపై ప్రభుత్వం నిషేధాన్ని పొడిగించింది.