మహిళా రక్షణ అనే అంశం ఆర్భాటాలకే కానీ ఆచరణలో చిత్తశుద్ధి లేదు: రావి సౌజన్య

విజయవాడ నగర పరిధిలో 37 డివిజన్ కి చెందిన 9 వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలిక వినోద్ జైన్ అనే వ్యక్తి లైంగిన వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధాకరం. ఆ బాలిక యొక్క ఆత్మహత్యని కూడా రాజకీయం చెయ్యటం టిడిపి, వైసిపి పార్టీలకు సరికాదు. బాలిక తల్లి లెక్చరర్ అయి ఉండి తన ఇంటిలో ఇలాంటి సంఘటన జరగడం ఆ తల్లి యొక్క బాధ వర్ణనాతీతం మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ బాలిక యొక్క కుటుంబాన్ని పరమర్శించి జరిగిన సంఘటనకు త్వరగా న్యాయం జరిగేలా చేస్తాము అని ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలి కానీ విషయాన్ని రాజకీయం చెయ్యడం సరికాదు. స్పందించాల్సిన హోంమంత్రి నిస్సహాయంగా ఉడిపోవడం చూస్తుంటే ప్రభుత్వం జరిగిన సంఘటన మీద ఎంత భాద్యతరహితంగా ఉంటుందో అర్థమౌతుంది. కనుక భాద్యులు ఏ పార్టీ వారు అయినప్పటికీ వినోద్ జైన్ అనే వ్యక్తిని దిశా చట్టఒలో ఉన్న విధంగా 21 రోజుల్లో కఠినంగా శిక్షించాలి అని జనసేన పార్టీ తరుపున కోరుచున్నాము. అలానే సమస్య వచిన్నపుడు మహిళా సంఘాలు రాజకీయ పార్టీలు ధర్నాలు, రల్ల్య్ చెయ్యటం కాదు. సమస్య పరిష్కరించటానికి ఆ సమస్య యొక్క ములాలకి వెళ్లి సంగ్రంగా పరిశీలించి ఒక ప్రణాళిక రూపొందించాలి ఏ ప్రభుత్వమైనా కానీ గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం గాని మహిళ రక్షణ అనే అంశం ఆర్భాటాలకే కానీ ఆచరణలో చిత్తశుద్ధి లేదు. కానీ జనసేన మాత్రం మహిళ రక్షణకు ఓక నిర్దిష్ట ప్రణాళిక రూపొందించింది. భవిష్యత్తులో ఆ ప్రణాళికనే ఉపయోగించి మహిళలకు రక్షణ, భద్రత కల్పిస్తూ మెరుగైన సమాజం నిర్మిస్తుంది. ఈ సందర్భంగా బాలికలకు జనసేన పార్టీ తరుపు నుంచి ఒకటే విన్నవించుకుంటున్నాం, మీకు ఇలాంటి వేధింపులు ఎదురైనప్పుడు మీ కుటుంబ సభ్యలతో ముఖ్యంగా మీ తల్లితో ధైర్యంగా సమస్య చెప్పుకోండి, సమస్యకి పరిష్కారం దొరుకుతుంది, అంతే కాని ఆత్మహత్య లాంటి పిచ్చి పనులు చేసి తల్లి తండ్రులని జీవితాంతం వేదనకు గురిచేయకండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెపినట్టు జనసేన ప్రభుత్వం ఏర్పడగానే మహిళ రక్షణ, భద్రతకు నిర్దిష్టమైన ప్రణాళికతో బలంగా పనిచేస్తాం అని విజయవాడ తూర్పు నియోజకవర్గం జనసేన పార్టీ వీరమహిళ రావి సౌజన్య అన్నారు.